విజయవాడలో మైనర్ బాలిక సూసైడ్: టీడీపీ నుండి వినోద్ జైన్ సస్పెన్షన్

విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో   వినోద్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయనను  టీడీపీ సస్పెండ్ చేసింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో వినోద్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Minor girl suicide case in Vijayawada: Vinod Jain Suspended from TDP

విజయవాడ: Vijyawada విద్యాధరపురం కుమ్మరపాలెం సెంటర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ పై నుండి దూకి Minor Girl  ఆత్మహత్య చేసుకొన్న ఘటనలో Vinod jain ను పోలీసులు అరెస్ట్ చేశారు. వినోద్ జైన్ ను police అరెస్ట్ చేయడంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా TDP  ప్రకటించింది.

బెంజి సర్కిల్ వద్ద ఉన్న School లో బాలిక 9వ తరగతి చదువుతుంది. ఈ బాలికను వినోద్ జైన్ Sexual harassment గురి చేసినట్టుగా ఆరోపణలున్నాయి. Suicideచేసుకోవడానికి ముందు  ఆ బాలిక తన నోట్ బుక్ లో వినోద్ జైన్ వేధింపుల గురించి రాసింది.ఈ letter  ఆధారంగా పోలీసులు వినోద్ జైన్ ను ఇవాళ అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నాయకత్వం వినోద్ జైన్ పై చర్యలు తీసుకొంది.

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 37 డివిజన్ కు చెందిన వినోద్ కుమార్ జైన్ పార్టీ క్రమశిక్షణ,విధి విధానాలకు వ్యతిరేకంగా అనైతిక చర్యలకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడంతో పార్టీ నుండి వినోద్ జైన్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు Nettam Raghu Ramఆదివారం నాడు ఓ ప్రకటనలో తెలిపాారు.టీడీపీ విధి విధానాలకు ఎవరైనా లోబడి ఉండాల్సిందేనని ఆయన ఆ ప్రకటనో తేల్చి చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో వినోద్ జైన్ టీడీపీ నుండి కార్పోరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.అయితే వినోద్ జైన్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడంతో ఆయనపై టీడీపీ చర్యలు తీసుకొంది. 

ఈ కేసును పోలీసులు కూడా సీరియస్ గా తీసుకొన్నారు. మరో వైపు బాలిక తల్లిదండ్రులను ఏపీ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ బాలిక తన నోట్ బుక్ లో మూడు పేజీల లేఖ రాసింది. ఆ తర్వాత అపార్ట్ మెంట్ టెర్రస్ పై అటు ఇటూ తిరిగింది. చివరికి టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకొంది.  బాలిక టెర్రస్ పై ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వినోద్ జైన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా తర్వాత కూడా  అధికార వైసీపీ నుండి టీడీపీ పై ఈ విషయమై విమర్శలు తీవ్రమయ్యాయి.  వినోద్ జైన్ విషయంలో చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ఏపీ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు.

మరో వైపు  ఈ ఘటనపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారుద. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొందని వాసిరెడ్డి పద్మ  చెప్పారు.  అన్నీ విషయాలు పోలీసుల విచారణలో తేలుతాయన్నారు.ఘటనకు కారణమైన నిందితుడిని  వదిలిపెట్టే ప్రసక్తేలేదని అని వాసిరెడ్డి పద్మ తేల్చి చెప్పారు.ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే  ప్రశ్నించారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios