విజయవాడ: అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మాయమాటలతో బాలికను నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  

బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన బాదిత బాలిక ఎనిమిదవ తరగతి చదువుతోంది. అయితే ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తాజాగా ఈ దారుణం గురించి బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.