దీపావళి పండగరోజు విశాఖ జిల్లా చోడవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోంచి అర్థరాత్రి మాయమైన ఓ యువతి పట్టణ శివారులో శవమై తేలింది. అయితే ఈ బాలికను మొదట అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితులు ముగ్గురు మైనర్ బాలురే. ఈ హత్య, అత్యాచారంపై వారిని ఇంకా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.   చోడవరం కోటవీధికి చెందిన పిల్లల ఈశ్వరరావు, లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె పిల్లల పద్మావతి (17).  ఈమె తమ ఎదురింట్లో ఉండే ఓ బాలునితో ప్రేమలో పడింది. అయితే ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పద్మావతితో పాటు ఆ బాలున్ని తీవ్రంగా హెచ్చరించారు.

అయితే గత బుధవారం(దీపావళి) రోజు రాత్రి ఇంట్లో పడుకున్న పద్మావతి తెల్లారే సరికి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలోనే పట్టణ శివారులో ఓ బాలిక శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త గురించి తెలుసుకున్న పద్మావతి కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా వారి అనుమానం  నిజమైంది. ఖాళీపోయిన స్థితిలో వున్న శవం తమ కూతిరిదేనని పద్మావతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

దీంతో మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు చెప్పినట్లు పద్మావతిని ఆమె ప్రియుడే తన స్నేహితులతో కలిసి హతమార్చినట్లు గుర్తించారు. దీంతో ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను ఇంకా అనుమానితులుగానే భావిస్తున్నట్లు వారే ఈ హత్య చేసినట్లు ఇంకా నిర్ధారించలేదని  అనకాపల్లి డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

విశాఖలో యువతిపై అత్యాచారం, హత్య...ప్రేమికుడిపైనే అనుమానం