మంత్రులు రాసిన లేఖలో ‘మీరసలు ఈ రాష్ట్ర వాసులేనా’ అంటూ పెద్ద సందేహమే వ్యక్తం చేసారు. ‘మీకసలు ఈ రాష్ట్రంతో ఉన్న అనుబంధమేంటి?’ అంటూ నిలదీసారు. ‘ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిని పొరుగు రాష్ట్రంలో వెళ్ళి కలిసారు’ అంటూ ఎద్దేవా చేసారు. ‘ఆంధ్రపద్రేశ్ లో ప్రతిపక్షనేతనన్న స్పృహ మీకసలుందా’? అంటూ నిలదీసారు. ‘ప్లీనరి నిర్వహించుకోవటానికి మాత్రం ఈ రాష్ట్రం కావాల్సి వచ్చిందా’? అంటూ ప్రశ్నించారు. పైగా లేఖలో జగన్ను ‘పొరుగు రాష్ట్ర వాస్తవ్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి’..       అంటూ సంభొదించటం గమనార్హం.

మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఏపితో ఎటువంటి సంబంధమూ లేదని మంత్రులు తేల్చేసారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని కె. అచ్చెన్నాయడు, నక్కా ఆనందబాబు, ఆదినారాయణరెడ్డిలు జగన్ కు శుక్రవారంరాత్రి బహిరంగ లేఖ రాసారు. శనివారం ఉదయం ప్లీనరీ జరగబోతున్న సందర్భంగా మంత్రులు బహిరంగ లేఖ రాస్తూ జగన్ను పరాయి రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా సంభోదించటం గమనార్హం.

మంత్రులు రాసిన లేఖలో ‘మీరసలు ఈ రాష్ట్ర వాసులేనా’ అంటూ పెద్ద సందేహమే వ్యక్తం చేసారు. ‘మీకసలు ఈ రాష్ట్రంతో ఉన్న అనుబంధమేంటి?’ అంటూ నిలదీసారు. ‘ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిని పొరుగు రాష్ట్రంలో వెళ్ళి కలిసారు’ అంటూ ఎద్దేవా చేసారు. ‘ఆంధ్రపద్రేశ్ లో ప్రతిపక్షనేతనన్న స్పృహ మీకసలుందా’? అంటూ నిలదీసారు. ‘ప్లీనరి నిర్వహించుకోవటానికి మాత్రం ఈ రాష్ట్రం కావాల్సి వచ్చిందా’? అంటూ ప్రశ్నించారు. పైగా లేఖలో జగన్ను ‘పొరుగు రాష్ట్ర వాస్తవ్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి’.. అంటూ సంభొదించటం గమనార్హం.

పై లేఖను రాసిన విధానం చూస్తుంటే ఎంత వీలైతే అంతా జగన్ను బద్నాం చేయ్యాలన్న నిర్ణయానికి మంత్రులు వచ్చినట్లే కనబడుతోంది. పైగా ఏపిలో ప్లీనరీ నిర్వహించుకునే నైతిక హక్కు లేదని కూడా మంత్రులే తేల్చేసారు. ప్లీనరీలు, ధర్నాలు, ఆందోళనలు, పలకరింపులు మినహా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా ఉందా అని అడగటం విచిత్రంగా ఉంది.

జగన్ను పొరుగురాష్ట్ర వాసిగా ఎలా నిర్ణయించారో మంత్రులు స్పష్టం చేయలేదు. నిజంగానే జగన్ పొరుగు రాష్ట్రవాసి అయితే, మరి చంద్రబాబు కూడా పొరుగు రాష్ట్రవాసే కదా? ఎదుకంటే, చంద్రబాబుకు కూడా సొంత ఇల్లు హైదరాబాద్ లోనే ఉంది. ముఖ్యమంత్రి కాబట్టి విజయవాడలో క్యాంపు ఆఫీసు పెట్టుకున్నారు. జగన్ కు కూడా క్యాంపు కార్యాలయం విజయవాడలోనే ఉంది. ఇక, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిని జగన్ హైదరాబాద్ లో కలిసారట. తప్పేముంది? ప్రస్తుతానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కదా?

ఇక, ధర్నాలు, ఆందోళనలు, పలకరింపులంటారా? ఏరాష్ట్రంలోనైనా ప్రతిపక్షమన్నాక చేసేదదేకదా? పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు టిడిపి చేసిందేమిటి? రాత్రికి రాత్రి అధికారంలోకి రావాలని జగన్ కుతంత్రాలు చేస్తున్నారట. ఎవరి ఎంఎల్ఏలను ఎవరు లాక్కున్నారు? తెలంగాణాలో ‘ఓటుకునోటు’ కేసు మాటేమిటి? కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏం చేద్దామని ప్రయత్నించి ఓటుకునోటు కేసులో ఇరుకున్నారు? ఓటుకునోటు కేసు దెబ్బకు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చేసారు కానీ లేకపోతే చంద్రబాబు కూడా హైదరాబా లోనే ఉండేవారన్నది సంగతి అందరికీ తెలిసిందే.