ఇంతమంది జగన్ లక్ష్యంగా పొద్దుటి నుండి విరుచుకుపడుతున్నారంటేనే జగన్ హామీలు ఏ స్ధాయిలో టిడిపిని కలవర పెడుతున్నాయో అర్ధమైపోతోంది.
మొత్తం మీద వైసీపీ ప్లీనరీ అధికార టిడిపిలో కలకలం రేపింది. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి ఎవరొస్తారన్నది పక్కన బెడితే జగన్ ప్లీనరీలో ఇచ్చిన హామీలు తెలుగుదేశంపార్టీలో మాత్రం పెద్ద కలకలమే సృష్టించిందన్నది వాస్తవం. ఎందుకంటే, జగన్ హామీలపై మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ తో పాటు ఎంపిలు సిఎం రమేష్, జెసి దివాకర్ రెడ్డే కాకుండా జలీల్ ఖాన్ లాంట వాళ్ళు కూడా విరుచుకుపడటమే నిదర్శనం.
ఇంతమంది జగన్ లక్ష్యంగా పొద్దుటి నుండి విరుచుకుపడుతున్నారంటేనే జగన్ హామీలు ఏ స్ధాయిలో టిడిపిని కలవర పెడుతున్నాయో అర్ధమైపోతోంది. ప్లీనరీకి పార్టీ శ్రేణులు, జనాల నుండి వచ్చిన స్పందన కూడా అనూహ్యంగా ఉందని ఇంటెలిజెన్స్ పోలుసులు కూడా నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్లీనరీ రెండు రోజులూ 60 వేలమంది చొప్పున హాజరైనట్లు ఓ అంచనా. పార్టీ నాయకత్వం మాత్రం రోజుకు 30 వేలమందిదాకా రావచ్చని వేసిన అంచనాకు రెట్టింపు రావటంతోనే జగన్లో కూడా ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడింది.
మొన్ననే విశాఖపట్నంలో జరిగిన టిడిపి మహానాడు వెలె తెలా పోవటం, నిన్న ముగిసిన ప్లీనరీ సూపర్ సక్సెస్ అవ్వటంతో మంత్రులు జీర్ణించుకోలేకున్నారు. అందుకనే జగన్ పై అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.
