‘ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు’

minister yanamala fire on ycp and bjp
Highlights

ఏపీ మంత్రి యనమల

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేనేలేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను సమర్పించిన సంగతి తెలిసిందే. కాగా.. స్పీకర్ సుమిత్రా మహాజన్.. ఆ రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.

కాగా.. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వెళ్లి రాజీనామాలు ఇస్తే ఆరోజే ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. రాజీనామాలు ఆమోదించినా నోటిఫై చేయడానికి సమయం ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామాలపై పథకం ప్రకారమే వైసీపీ ఎంపీలను పిలిచారని...వైసీపీ, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి యనమల మండిపడ్డారు.
 

loader