విజయవాడలో (vijayawada) తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (vellampalli srinivasa rao) మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా గత రెండు నెలల నుంచి నిందితుడు వేధిస్తున్నాడని మండిపడ్డారు.

విజయవాడలో (vijayawada) తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (vellampalli srinivasa rao) మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా గత రెండు నెలల నుంచి నిందితుడు వేధిస్తున్నాడని మండిపడ్డారు. ఇది చాలా దుర్మర్గామని.. దీనిపై ముఖ్యమంత్రి జగన్ (ys jagan mohan reddy) తనను పిలిచి వివరాలు ఆరా తీశారని వెల్లంపల్లి చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఆ ప్రాంతంలో దాదాపు 150 నుంచి 200 కుటుంబాలు నివసిస్తున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. నిందితుడి దారుణాల గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ వయసులోనే మూడు పేజీల లేఖ రాసిందంటే.. ఏ స్థాయిలో మనోవేదన అనుభవించిందోనని వెల్లంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎంపీ కేశినేని నానికి (kesineni nai) ముఖ్య అనుచరుడని, కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ (tdp) నుంచి పోటీ చేశాడని వెల్లంపల్లి చెప్పారు. దీనిపై చంద్రబాబు ఎలాంటి సమాధానం చెబుతారని మంత్రి నిలదీశారు. 

కాగా.. విజయవాడ నగరంలోని భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్‌ వద్దగల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అయితే తనను ఓ యువకుడు గత కొన్ని రోజులు వేధిస్తున్నాడని నోట్ బుక్‎లో రాసి బాలిక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడివున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మహత్యకు పాల్పడక ముందు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరుగుతూ సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.