Asianet News TeluguAsianet News Telugu

సానుభూతి కోసం అఖిలమ్మఅవస్థలు

  • ఇదేదో ఎన్నికల్లో సానుభూతి ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలాగే ఉంది.
  • ఎందుకంటే, శిల్పా తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారే గానీ ఏ విధంగా అని మాత్రం చెప్పలేదు.
  • ఒకవేళ నిజంగానే శిల్పా, అఖిల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసాడనే అనుకుందాం, మరి చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు?
  • మిగిలిన నేతలందరూ ఏం చేస్తున్నట్లు?
Minister trying to cultivate sentiment in namdyala by poll

సానుభూతిని పండించేందుకు మంత్రి అఖిలప్రియ నానా అవస్తలు పడుతున్నారు. విషమమేంటంటే, నంద్యాలలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి వల్ల భూమా నాగిరెడ్డి కుటుంబం బాగా ఇబ్బందులు పడిందట. నాగిరెడ్డి మరణం తర్వాత శిల్సా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా  తాము మాత్రం శిల్పా చెక్రపాణిరెడ్డిని ఎంఎల్సీగా గెలిపించామని చెప్పారు. ఎన్నికల సమయంలో మంత్రి ఈ విధంగా చెప్పటం కాస్త విచిత్రంగానే ఉంది.

ఇదేదో ఎన్నికల్లో సానుభూతి ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలాగే ఉంది. ఎందుకంటే, శిల్పా తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారే గానీ ఏ విధంగా అని మాత్రం చెప్పలేదు. పైగా శిల్పా, భూమా ఇద్దరూ అధికారపార్టీలో ఉన్నపుడు ఇక శిల్పా, అఖిల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసేదేముంటుంది? భూమా నాగిరెడ్డి మరణించిన దగ్గర నుండి నంద్యాలలో పోటీ చేసేందుకు పొరాటం చేయటంతోనే శిల్పా కు సమయం సరిపోయింది.

ఒకవేళ నిజంగానే శిల్పా, అఖిల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసాడనే అనుకుందాం, మరి చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు? మిగిలిన నేతలందరూ ఏం చేస్తున్నట్లు? అంటే ఎవరూ పట్టించుకోలేదంటే భూమా అఖిల కుటుంబాన్ని అందరూ గాలికి వదిలేసినట్లేనా? ఇక, శిల్పా అంటే మోహన్ రెడ్డి, చక్రపాణిరెడ్డి అనే కదా అర్ధం. మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టినా చక్రపాణిరెడ్డిని గెలిపించామని అఖిల చెప్పటంలో అర్ధమేలేదు.

ఎందుకంటే, పార్టీ అభ్యర్ధిగా చక్రపాణిరెడ్డి గెలుపుకు భూమా కుంటుంబం పనిచేసి ఉండవచ్చు. మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టటానికి చక్రపాణిరెడ్డి గెలుపుకు పనిచేయటానికి సంబంధమే లేదు. అయినా ఇపుడే ఆ విషయాలను అఖిల ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అంటే సానుభూతికోసమే అని చెప్పట తప్పదు. పైగా మోహన్ రెడ్డికి ఓట్లేస్తే అభివృద్ధిని అడ్డుకుంటారని జనాలు అనుకుంటున్నారట. నిజంగా మంత్రి భలే జోకులేస్తున్నారు. వైసీపీ ఎంఎల్ఏ గెలిస్తే అభివృద్ధి అడ్డుకుంటారా? ఇప్పటి వరకూ వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 46 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏముంది? ఎంఎల్ఏలు అడ్డుకున్నదేముంది?

Follow Us:
Download App:
  • android
  • ios