టిడిపి హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి : మంత్రి సోమిరెడ్డి

minister somireddy visits venkatachalam mandal
Highlights

కామాక్షి దేవీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన, శిలాప్రతిష్ట

వెంకటాచలం మండలం పూడిపర్తిలో శ్రీ కామాక్షి దేవీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన, శిలాప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రామలింగేశ్వర స్వామి ఆలయ శిలాప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. నాకు ఈ మహర్భాగ్యం కల్పించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతులతో పాటు ప్రజలందరి శ్రేయస్సే మా లక్ష్యం. రూర్బన్ పథకం కింద పూడిపర్తిలో రూ.1.27 కోట్లతో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాం.

ఎస్సీ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయించాం. అంగన్వాడీ కేంద్రానికి భవనం నిర్మించాం. రూ.10 లక్షలతో తాగునీటి పథకం మంజూరు చేయించాం. పొలాల్లోకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయిస్తా. గతంలో టీడీపీ హయాంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశాం..మళ్లీ ఇప్పుడు చేస్తున్నాం. ఒక్క పూడిపర్తిలోనే కాదు..సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశాం..ఇంకా చేస్తున్నాం.

loader