ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆయన తిట్ల పురాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పాలసముద్రం గ్రామానికి వచ్చిన  వైసీపీ నేత దిలీప్ రెడ్డిని అసభ్య పదజాలంతో మంత్రి దూషించారు. 

నియోజకవర్గంలో తమ వర్గానికి కాకుండా ప్రత్యర్థి వర్గానికి మద్దతు తెలుపుతున్నాడంటూ దిలీప్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈనెల 21న పెనుకొండలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా రక్తదాన శిబిరం వద్దకు వచ్చిన దిలీప్ రెడ్డిపై మండిపడ్డారు. దీంతో  దిలీప్ రెడ్డి మనస్తాపంతో అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి తిట్లు వైరల్ అవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.