వైఎస్ జగన్ ఫిర్యాదుల కారణంగానే పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం టెండర్లలో బేరసారాలు కుదరకపోవడంతోనే వైసీపీ పుట్టిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాద సమయంలోనే కేవీపీ, జగన్ పోలవరం టెండర్లను అప్‌లోడ్ చేశారని ఆరోపించారు. శనివారం పోలవరం ప్రాజెక్టు పనులపై సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో దేవినేని సమీక్ష జరిపారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఆలస్యానికి జగనే కారణమంటూ నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రకటించారు.