తనపై టిడిపి నాయకుల అనుచిత వ్యాఖ్యల వెనకున్నది నారా లోకేష్ అని మంత్రి రోజా ఆరోపించారు. అయితే తనను తిడుతున్న నాయకుడు గతంలో లోకేష్ భార్య బ్రాహ్మణిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసారని రోజా అన్నారు.
అమరావతి : తనపై మాజీ మంత్రి, టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. ప్రత్యర్థి పార్టీ నాయకురాలినైన తనపైనే కాదు చివరకు టిడిపి అధినేత చంద్రబాబు ఇంట్లోని ఆడవాళ్ళపైనా ఈ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసారన్నారు. వీళ్లకు మహిళలంటే గౌరవమే లేదని... వారిని ప్రశ్నిస్తున్నందుకే తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ రోజా కంటతడి పెట్టుకున్నారు.
టిడిపి నాయకులతో తనను తిట్టిస్తున్నదే నారా లోకేష్... మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్నపాత్రుడు లను ఆయన ప్రోత్సహిస్తున్నాడని రోజా ఆరోపించారు. అయితే గతంలో తన భార్య బ్రాహ్మణి గురించి ఇదే అయ్యన్న ఎంత నీచంగా మాట్లాడాలో లోకేష్ తెలుసుకుంటూ బావుంటుందన్నారు. బాలకృష్ణ కూతురు, లోకేష్ పెళ్ళామా... అదెవరు? దాని పేరేంటి? అంటూ అయ్యన్నపాత్రుడు మాట్లాడినట్లు రోజా ఆరోపించారు.
తనపై అసభ్యకర విమర్శలు చేయిస్తున్న లోకేష్ కు ఇదే పరిస్థితి వచ్చిందన్నారు. తనపై దుమ్మెత్తి పోయించాలనుకుంటే అది అతడి కళ్లలోనే పడిందన్నారు. ఈరోజు లోకేష్ భార్య బ్రాహ్మణిపై కూడా టిడిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని బ్రాహ్మణి కూడా గుర్తించాలని రోజా అన్నారు.
Read More మహిళలను కించపర్చడమేనా మీ సంస్కృతి: బండారు వ్యాఖ్యలకు రోజా కౌంటర్
ఇక తనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారుపై రోజా సీరియస్ అయ్యారు. అసలు తన క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి ఎవడతను... ఏ హక్కు వుందని తన గురించి అంత నీచంగా మాట్లాడతాడు? అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబంలోని ఆడవాళ్ల గురించి మాట్లాడాననే తనను విమర్శించానని బండారు అటున్నాడు... ఇదే కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవరాళ్లు ఎన్టీఆర్ కు అన్నం కూడా పెట్టకుండా వదిలేసినపుడు ఏమయ్యింది ఈ పౌరుషం? అని నిలదీసారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చెప్పులేసి మరీ అవమానించిన చంద్రబాబు పంచన చేరావు కదా? ఇదేనా నీకు ఎన్టీఆర్ పై వున్న అభిమానం అని బండారును ప్రశ్నించారు రోజా.
ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన చంద్రబాబు కోసం నందమూరి కుటుంబం రోడ్డుపైకి వచ్చి డ్రామాలు చేస్తోందనే తాను అన్నానని... ఇందులో తప్పేముందని రోజా ప్రశ్నించారు.ఎన్టీఆర్ కు అన్యాయం జరిగినప్పుడు వీళ్లంతా ఏమైపోయారు? అని ప్రశ్నించినందుకే టిడిపి నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఎదుగుతున్నందే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు.
