Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కుటుంబానిది మంచి టీమ్ వర్క్... ప్రజాధనం దోపిడీ చేయడంలో..: రోజా సెటైర్లు (వీడియో)

చంద్రబాబు నాయుడు అవినీతిలో ఆయన కుటుంబసభ్యుల భాగస్వామ్యం కూడా వుందని... ఈ విషయంలో వీరిది మంచి టీమ్ వర్క్ అని మంత్రి రోజా సెటైర్లు వేసారు. 

Minister Roja satires on Chandrababu family AKP
Author
First Published Sep 27, 2023, 2:07 PM IST

విజయవాడ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి జైల్లో వున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంపై మంత్రి రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీమ్ వర్క్ అంటే చంద్రబాబు కుటుంబానిదేనని... ప్రజాధనం దోపిడీ చేయడంలో వీరందరూ భాగస్వాములేనని ఆరోపించారు. చంద్రబాబు దోపిడీదారుడని అందరికీ తెలుసు... కానీ ఆయన భార్య, కొడుకు, కోడలు కూడా ఈ దోపిడీలో భాగస్వాములని ప్రజలకు అర్ధమవుతోందని అన్నారు. ఇంతకాలం ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం భువనేశ్వరి, బ్రహ్మణి లపై వుండేదని... కానీ తప్పుచేసిన వ్యక్తికోసం అబద్దాలాడుతూ ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని రోజా అన్నారు. 

ప్రస్తుతం దేశ రాజధాని డిల్లీలో వున్న నారా లోకేష్ తప్పుచేసిన తండ్రిని భయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ల కాళ్లు పట్టుకోవాలని చూస్తున్నాడని అన్నారు. కానీ అవినీతికి పాల్పడి అడ్డంగా బుక్కయిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్దంగా లేరు... అందుకే మోదీ, అమిత్ షా లు లోకేష్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదని రోజా అన్నారు.

వీడియో

చివరకు తప్పుచేసిన తండ్రిని కాపాడాలంటూ లోకేష్ రాష్ట్రపతిని వేడుకున్నారని రోజా అన్నారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదు అనేలా లోకేష్ చర్యలు వున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు... కానీ అవినీతిపరుడైన తండ్రి కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసాడంటూ రోజా మండిపడ్డారు. 

Read More  అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

టిడిపి హయాంలో చంద్రబాబు అడ్డగోలగా దోచుకున్నాడని... స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాం లు చేసాడని రోజా ఆరోపించారు. తండ్రి లాగే కొడుకు లోకేష్ కూడా స్కాం లు చేసాడు... ఇప్పుడు తనకేమీ తెలియని అమాయకుడిలా మాట్లాడుతున్నాడని అన్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకుండానే స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నాడు... అలైన్ మెంట్ పేరుతోనే దోచుకున్నది మరిచావా? అని రోజా నిలదీసారు. 

కుంభకోణాల్లో ఇరుక్కుని డిల్లీకి పారిపోయిన లోకేష్ ఆరు నెలల్లో రిటర్న్ గిప్ట్ ఇస్తాడట... ఈ మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారని రోజా ఎద్దేవా చేసారు. ఏదో బుక్ లో పేర్లు రాసుకుంటున్నానని అంటున్న లోకేష్ సిఐడి మెమోలో తన పేరు చేరిందని గుర్తించాలని ఎద్దేవా చేసారు. కాళ్ళ నుండి కన్నుల వరకూ భయంతో వణికిపోతున్న లోకేష్ పైకి మాత్రం ఏదో దైర్యం వున్నవాడిలా మాట్లాడుతున్నాడని అన్నారు.  

ప్రజల సొమ్ము దోచుకోవాల్సిన అవసరం లేదని... తమ హెరిటేజ్ లో 2శాతం షేర్లు అమ్మితెనే రూ.400కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారని రోజా గుర్తుచేసారు. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లు అన్నమాట... ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టం చేశారా?  అని ప్రశ్నించారు. తండ్రి కర్జూర నాయుడు చంద్రబాబుకు ఎకరం భూమి ఇచ్చారు... అలాంటిది ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీసారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లే రూ.600 కోట్లు వుంటుంది... ఇక మిగతా చోట్ల ఆయన ఆస్తులకు లెక్కే లేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాదు ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా చంద్రబాబు కుటుంబ అవినీతి గురించి తెలుసుకోవాలని మంత్రి రోజా అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios