సెక్రటేరియట్ ఎక్కడ ఉంటే ఏంటీ, ఇక్కడైనా ఉండొచ్చు, మరెక్కడైనా ఉండొచ్చని మంత్రి పేర్నినాని తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలనేది రిపోర్టులో ఉంటుందని మంత్రి తెలిపారు.

ఒక చోట సెక్రటేరియెట్ మరో చోట అసెంబ్లీ ఉంటే తప్పేంటని నాని ప్రశ్నించారు. అంతా నాకే ఉండాలి.. అంతా నా జిల్లాలోనే ఉండాలనే భావన కరెక్ట్ కాదని మంత్రి పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదికలో అలా ఉండొచ్చు.. కావొచ్చు అనే సీఎం అన్నారని, కానీ నిర్ణయం తీసుకున్నట్లుగా జగన్ చెప్పలేదని నాని గుర్తుచేశారు.

Also read:జగన్ ట్విస్ట్ ఇస్తాడని అప్పుడే చెప్పా, హైకోర్టు ఒకే కానీ..: బీజేపీ ఎంపీ కామెంట్స్

నిర్ణయం తీసుకుంటే దమ్ముగా చెప్పి చేసే సత్తా ఉన్న నాయకుడు జగన్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదిగా, అందరి అభిప్రాయల మేరకే నిర్ణయాలు ఉంటాయని నివేదికలో ఇలా ఉండొచ్చనే రీతిలోనే సీఎం చెప్పారని నాని వెల్లడించారు.

ప్రజల ఆకాంక్ష మేరకు రిపోర్ట్ ఉంటుందని, గంటా విశాఖలో, కేఈ కర్నూలులో యనమల, నారాయణ ఇక్కడే బాగుంటుందని చెబుతున్న సంగతిని మంత్రి గుర్తుచేశారు. అయితే మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని నాని వెల్లడించారు.

Also Read:లిమిట్ దాటేశారు, మీది తుగ్లక్ మైండ్ సెట్: జగన్ పై మాజీమంత్రి ఫైర్

రాజధానిపై జగన్ ఏం చెప్పారని ఇంత చర్చ, మూడు చోట్ల రాజధాని ఉండొచ్చని మాత్రమే జగన్ అభిప్రాయపడ్డారని, చంద్రబాబును నమ్మి మోసపోయిన రైతులను జనగ్ ఆదుకుంటారని మంత్రి స్పష్టం చేశారు.