Asianet News TeluguAsianet News Telugu

ఆ ఎమ్మెల్యేలు టిడిపిని మాత్రమే వీడారు... వైసిపిలో చేరలేదు: మంత్రి పెద్దిరెడ్డి సంచలనం

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిత్యం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై బురదజల్లటమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర భూగర్భ గనులశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. 

minister peddireddy ramachandra reddy sensational comments on tdp mlas joining ycp
Author
Vijayawada, First Published Jun 10, 2020, 9:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిత్యం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై బురదజల్లటమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర భూగర్భ గనులశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయన అధికారంలో వుంటేనే పాలన నిబంధనల ప్రకారం జరిగిందని అనుకుంటాడని... ఆయన వ్యవహారం పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న సామెత మాదిరిగా వుందన్నారు.  

చంద్రబాబు తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకుంటున్నాడు. డెబ్బై సంవత్సరాల వయస్సు వున్న చంద్రబాబు, పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడతారా? దీనిని ముఖ్యమంత్రి గారికి ఆపాదించాలని చూడటం దురదృష్టకరం. ఈ ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. లాటరైట్ మైన్లను కబ్జా చేస్తున్నామని కూడా చంద్రబాబు ఆరోపిస్తున్నాడు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క లాటరైట్ మైనింగ్ కు కూడా మేం అనుమతులు ఇవ్వలేదు.  గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఈ మైనింగ్ జరుగుతోంది'' అని అన్నారు. 
 
''డెబ్బై కోట్లతో నాసిరకం బ్లీచింగ్ కొనుగోలు చేశారని గతంలో ఆరోపించారు. మొత్తం కొనుగోళ్ళే రూ. 5.90 కోట్లు, దానిలో చెల్లించింది 74 లక్షలు మాత్రమే. పత్రికల్లో కథనాలు రాకముందే మా అధికారులు సదరు బ్లీచింగ్ నాణ్యతపై ల్యాబ్ లకు పంపించారు. సదరు సంస్థకు డబ్బు చెల్లించలేదు, అలసత్వం వహించిన గుంటూరు డిపిఓపై చర్యలు తీసుకున్నాము. గోరంతలను కొండతలు చేయడం టిడిపికి, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియాకు అలవాటుగా మారింది. ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేసేందుకు ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారు''అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.  
 
''నిమ్మగడ్డ వ్యవహారంపై రెండు వారాల తరువాత విచారిస్తామని సుప్రీంకోర్ట్ చెప్పింది. దానిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని అన్నారు. 

''2014 ఎన్నికల తరువాత చంద్రబాబు మా పార్టీ ఎంపిటిసిలను లాక్కొన్నాడు. మా పార్టీ జెడ్పీటిసిలను తీసుకుని జెడ్పీ చైర్మన్ లను ఎంపిక చేసుకున్నాడు. చివరికి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపును ప్రోత్సహించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.  51 శాతం ఓట్లతో 151 ఎమ్మెల్యేలను గెలిచాం. మా పాలనను చూసి ఎవరైనా మా పార్టీలో చేరతామంటే తప్పులేదు. కానీ అనైతికంగా చంద్రబాబులా ఏ ఎమ్మెల్యేను మేం ఫిరాయింపులకు ప్రోత్సహించడం లేదు.  ఇప్పటి వరకు టిడిపి ఎమ్మెల్యేలు వారి పార్టీని వదిలిపెట్టారే కానీ, మా పార్టీలో చేరినట్లు ఎక్కడైనా ప్రకటించారా?'' అని టిడిపి నాయకులను మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

read more  బెదిరింపులకు పార్టీ మారడం పిరికితనం, ఇక గేర్ మారుస్తా: చంద్రబాబు

చంద్రబాబుకు వైసిపి ప్రభుత్వం ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందని... చివరికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు కూడా రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత అంటూ తప్పుడు ఆరోపణలకు దిగజారుతున్నాడని మంత్రి మండిపడ్డారు. 

''గుంటూరుజిల్లా దాచేపల్లిలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి గత ప్రభుత్వాలు ఇచ్చిన లీజులను యాబై ఏళ్ళకు అక్రమంగా పొడిగించుకున్నారంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. కేంద్రప్రభుత్వ నిబంధనలు సెక్షన్ 8A(3) ప్రకారం ప్రస్తుతం లీజులను కలిగివున్న వారు మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటే... యాబై ఏళ్ళకు సదరు లీజును పొడిగించాలని ఖచ్చితమైన నిబంధనలు వున్నాయి. దాని ప్రకారం సరస్వతి పవర్ సంస్థ చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన మైనింగ్ శాఖ 8.6.2020న యాబై ఏళ్ళకు సదరు సంస్థ పరిధిలోని భూమికి లీజు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని చంద్రబాబు బూతద్దంలో చూపుతూ... సీఎం తన సొంత సంస్థకు అక్రమంగా లీజును పొడిగించుకున్నారంటూ తప్పుడు విమర్శలకు దిగాడు'' అని వివరించారు.  

అసలు వాస్తవాలు ఏమిటంటే...
 
''సరస్వతి పవర్ అండ్ ఇండ్రస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పటి ప్రభుత్వం 18.5.2009 లో 30 ఏళ్ళకు 613 హెక్టార్ లలో లైమ్ స్టోన్ కోసం మైనింగ్ అనుమతులు ఇచ్చింది. తరువాత రాజకీయ కారణాలతో ఈ లీజ్ ను తెలుగుదేశం ప్రభుత్వం 2014లో లీజును రద్దు చేసింది. కక్షపూరితంగా తమ లీజును రద్దు చేశారంటూ సరస్వతీ పవర్ సంస్థ గౌరవ హైకోర్ట్ ను ఆశ్రయించింది.దానిపై విచారణ జరిపిన హైకోర్ట్  సదరు లీజు అనుమతులను పునరుద్దరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మైనింగ్ అధికారులు సరస్వతి పవర్ సంస్థ చెల్లించాల్సిన బకాయిలను కట్టించుకుని కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం 12.12.2019 ప్రకారం లీజులను పునరుద్దరించింది'' అని తెలిపారు.   

''కేంద్రప్రభుత్వ నిబంధనలు సెక్షన్ 8 A(3) ప్రకారం యాబై ఏళ్ళకు లీజును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  దీనిని చంద్రబాబు తప్పుపడుతున్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఇదే కేంద్రప్రభుత్వ నిబంధనలు సెక్షన్ 8 A(3) ప్రకారం ప్రకారం 3.11.2016 నుంచి 12.2. 2019 వరకు వివిధ కంపెనీలకు సంబంధించిన మొత్తం 30 మైనింగ్ లీజులను 50 ఏళ్ళ  పొడిగించింది. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే తరహాలో యాబై ఏళ్ళకు లీజు పొడిగించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు ఈ లీజులను కూడా అక్రమంగా పొడిగించినవనని అంగీకరిస్తారా? తన హయాంలో ముప్పై సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా లీజును పొడిగించి మేలు చేశానని ఒప్పుకుంటాడా?'' అని అడిగారు. 

''కేంద్రప్రభుత్వ నిబంధనలను టిడిపి ప్రభుత్వం అమలు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అంటే మీరు చేస్తే అతి పవిత్రమైనది... వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేస్తే మాత్రం తప్పుడు పని అంటారా? గత ఎన్నికల్లో అధికారంకు దూరమైన చంద్రబాబుకు పూర్తిగా మతిభ్రమించింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే... తన పాలనలో ఇచ్చిన ఉత్తర్వులు కూడా తప్పేనని ఒప్పుకుంటున్నట్లు కాదా? దమ్ముంటే టిడిపి హయాంలో ఇచ్చిన ముప్పై సంస్థలకు లీజు గడువు పెంపు కూడా అక్రమంగా చేసిందేనని ఒప్పుకోవాలి'' అని సూచించారు. 

''చంద్రబాబు తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకుంటున్నాడు. డెబ్బై సంవత్సరాల వయస్సు వున్న చంద్రబాబు, పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడతారా? దీనిని ముఖ్యమంత్రి గారికి ఆపాదించాలని చూడటం దురదృష్టకరం. ఈ ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. లాటరైట్ మైన్లను కబ్జా చేస్తున్నామని కూడా చంద్రబాబు ఆరోపిస్తున్నాడు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క లాటరైట్ మైనింగ్ కు కూడా మేం అనుమతులు ఇవ్వలేదు.  గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఈ మైనింగ్ జరుగుతోంది'' అని అన్నారు. 

read more   శిద్దా రాఘవులు వైసిపిలో చేరడానికి కారణమదే: వర్ల రామయ్య
 
''డెబ్బై కోట్లతో నాసిరకం బ్లీచింగ్ కొనుగోలు చేశారని గతంలో ఆరోపించారు. మొత్తం కొనుగోళ్ళే రూ. 5.90 కోట్లు, దానిలో చెల్లించింది 74 లక్షలు మాత్రమే. పత్రికల్లో కథనాలు రాకముందే మా అధికారులు సదరు బ్లీచింగ్ నాణ్యతపై ల్యాబ్ లకు పంపించారు. సదరు సంస్థకు డబ్బు చెల్లించలేదు, అలసత్వం వహించిన గుంటూరు డిపిఓపై చర్యలు తీసుకున్నాము. గోరంతలను కొండతలు చేయడం టిడిపికి, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియాకు అలవాటుగా మారింది. ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేసేందుకు ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారు''అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.  

''నిమ్మగడ్డ వ్యవహారంపై రెండు వారాల తరువాత విచారిస్తామని సుప్రీంకోర్ట్ చెప్పింది. దానిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని అన్నారు. 

''2014 ఎన్నికల తరువాత చంద్రబాబు మా పార్టీ ఎంపిటిసిలను లాక్కొన్నాడు. మా పార్టీ జెడ్పీటిసిలను తీసుకుని జెడ్పీ చైర్మన్ లను ఎంపిక చేసుకున్నాడు. చివరికి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపును ప్రోత్సహించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.  51 శాతం ఓట్లతో 151 ఎమ్మెల్యేలను గెలిచాం. మా పాలనను చూసి ఎవరైనా మా పార్టీలో చేరతామంటే తప్పులేదు. కానీ అనైతికంగా చంద్రబాబులా ఏ ఎమ్మెల్యేను మేం ఫిరాయింపులకు ప్రోత్సహించడం లేదు.  ఇప్పటి వరకు టిడిపి ఎమ్మెల్యేలు వారి పార్టీని వదిలిపెట్టారే కానీ, మా పార్టీలో చేరినట్లు ఎక్కడైనా ప్రకటించారా?'' అని టిడిపి నాయకులను మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios