Asianet News TeluguAsianet News Telugu

శిద్దా రాఘవులు వైసిపిలో చేరడానికి కారణమదే: వర్ల రామయ్య

తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి సిద్దా రాఘవులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. 

varla ramaiah reacts on  siddha raghavulu joining to YCP
Author
Amaravathi, First Published Jun 10, 2020, 6:58 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి సిద్దా రాఘవులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్దా రాఘవరావు మైన్స్ కు సంబంధించి అక్రమాలు జరిగాయని నోటీసులు ఇచ్చి బెదిరించారని... ఈ బ్లాక్ మెయిల్స్ కి బయపడే రాఘవులు వైసిపి లో చేరారని రామయ్య తెలిపారు. ఇలా లొంగదీసుకుని మీ పార్టీలో చేర్చుకున్న తర్వాత అక్రమాలన్నీ సక్రమాలు అయిపోతాయా? అని ప్రశ్నించారు. 

''ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రకమైన బ్లాక్ మైల్ పాలిటిక్స్ చేయటం, ఆస్తులు విధ్వంసం చేయడం ద్వారా తాత్కాలిక ప్రయోజనం పొందొచ్చునేమో గానీ ప్రజలు మాత్రం ఉపేక్షించరు. సరైన సంధర్బంలో తగిన బుధ్ధి చెబుతారు'' అని హెచ్చరించారు. 

''సరయిన నాయకుడు దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాలి. ఈ ప్రభుత్వం చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను, ప్రజలను నమ్మి పోరాడాలి. వెళ్లిపోవడమంటే వారి చరిత్రను వారే దిగజార్చుకోవడమే'' అని అన్నారు. 

read more  ఈ డిమాండ్లను నెరవేర్చండి: కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

''సిద్ధా రాఘవరావుకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల గౌరవాలనిచ్చింది. జగన్ మోహన్ రెడ్డి బ్లాక్ మెయిల్స్ కు లొంగిపోవటం వలన ఇప్పటి వరకు ఆయనను ఆ స్థాయికి తీసుకొచ్చిన పార్టీకి, తనకు అన్ని రకాల అండదండలు ఇచ్చిన ప్రకాశం జిల్లా, దర్శి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాల్సిన స్థితికి వెళ్లాడు'' అన్నారు. 

''ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి నేడు ఉత్తర కుమారుడు కన్నా దిగజారాడు. ఏడాదిలో ఆయన విధ్వంస పరిపాలనకు ప్రజలలో వస్తున్న వ్యతిరేకతని దృష్టి మళ్లించడానికి ఫిరాయింపులను ఆశ్రయించి దిగజారాడు. ఇలాంటి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, అనైతిక విధానాలకు పాల్పడుతున్న జగన్ దుశ్చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మేధావులు నిరసిస్తారు'' అని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios