Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఇంటి వెనుకే ఇసుక దోపిడి .. లోకేష్‌‌కు నెలకు రూ.500 కోట్లు మామూలు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని, ఇసుక దోపిడీ ముఠా నెలకు 500 కోట్లు లోకేష్ కి ఇచ్చేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. 

minister peddireddy ramachandra reddy fires on tdp chief chandrababu naidu ksp
Author
First Published Aug 31, 2023, 2:55 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడి, ప్రాజెక్ట్‌ల్లో అవినీతిపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ఇసుకను అక్రమంగా దోచేశారని ఆయన ఆరోపించారు. ఆయన ఇసుక దోపిడీ గురించి అందరికీ తెలుసునని మంత్రి ఎద్దేవా చేశారు. నారాసురుడు-ఇసుకాసురుడు పేరుతో పెద్దిరెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. 

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన ఇసుక విధానంపై 17.07.2020న మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం 16.04.2021న  జీవో 25 జారీ చేసి.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో ఇసుక అక్రమాలు చేపట్టినట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లకు ఆహ్వానం, నిర్వహణ , పర్యవేక్షణను అప్పగించినట్లు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలకు టెండర్ దొంగచాటుగానో, ఎవ్వరికీ తెలియకుండా చేసింది కాదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. 

ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ హయాంలో 19 సార్లు ఇసుక విధానం మార్చారని.. చంద్రబాబు ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని మంత్రి ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షి అడ్డుకుంటే సెక్రటేరియట్ కు పిలిచి రాజీ చేశారని పేర్కొన్నారు. వంశధార,నాగావళి,గోదావరిని పిండేసింది ఎవరో తెలుసునని.. ఇసుక దోపిడీ ముఠా నెలకు 500 కోట్లు లోకేష్ కి ఇచ్చేదని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో ఎన్‌జీటీ 100 కోట్లు జరిమానా విధించిందని ఆయన గుర్తుచేశారు. వైసీపీ వచ్చిన తర్వాత పర్యావరణానికి పెద్ద పీట వేశామని.. 2021 ఏప్రిల్ 16న ఇచ్చిన జీవో 25 ప్రకారం ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని రామచంద్రారెడ్డి చెప్పారు. 

చంద్రబాబు ఎందుకు టెండర్లలో పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. జేపీ వెంచర్స్ సంస్థ టన్నుకు 375 రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. ఏటా ఇసుకపై రూ. 765కోట్లు ఆదాయం వస్తుందని రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో 3825 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని మంత్రి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios