రాష్ట్రంలో ఫించన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) . కొత్త ఏడాది నుంచి పింఛన్లు పెంచడం సంతోషించదగిన విషయమన్నారు. పింఛన్ల పెంపుపై ప్రతిపక్షాలు వెటకారంగా మాట్లాడుతున్నాయని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో ఫించన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) . కొత్త ఏడాది నుంచి పింఛన్లు పెంచడం సంతోషించదగిన విషయమన్నారు. పింఛన్ల పెంపుపై ప్రతిపక్షాలు వెటకారంగా మాట్లాడుతున్నాయని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. వారి హయాంలో కేవలం 31 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని ఆయన గుర్తుచేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే గతంలో పింఛన్లు ఇచ్చేవారని, ఇప్పుడు అర్హులందరికీ ఇస్తున్నామని రామచంద్రారెడ్డి వెల్లడించారు. పేదరికాన్ని కొలమానంగా తీసుకొని పింఛన్‌ ఇస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత (mekathoti sucharitha ) మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లగల వ్యక్తి మన ముఖ్యమంత్రి అంటు జగన్‌పై ప్రశంసలు కురిపించారు. అధికారంలోకి వచ్చాక పింఛన్‌ పెంపుపై సీఎం జగన్‌ మొట్టమొదటి సంతకం చేశారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అది రూ.2,500కు పెరిగిందని... సంక్షేమ పథకాల కోసం అర్హులు గతంలో ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల గడప వద్దకే చేరుతున్నాయని... కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ ఫలాలు అందించిన జగన్‌కే దక్కుతుందని సుచరిత కొనియాడారు. 

Also Read:మధ్యాహ్నం నుంచే రూ. 2,500 పింఛన్ పంపిణీ.. వాళ్లకు కొత్త ఏడాది అయిన మంచి ఆలోచనలు రావాలి : సీఎం జగన్

కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు నెలకు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్‌ (monthly pension) మొత్తాన్ని రూ.2,500కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా (Guntur district) ప్రత్తిపాడులో (Prathipadu) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు తెలియజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాత్రమే పింఛన్ రూ. 2 వేలు అని చెప్పిందన్నారు. గతంలో pension ఎక్కువ మందికి ఇవ్వకుండా ఉండేందుకు ఆలోచనలు చేసేవారని విమర్శించారు. 

తాము అధికారంలోకి రాగానే పింఛన్ ‌రూ. 2,250కి పెంచామని తెలిపారు. ఈరోజు నుంచి పింఛన్‌ను రూ. 2,500కు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ఇక్కడ మాట్లాడటం పూర్తవ్వగానే.. మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్‌ అందిస్తారని వెల్లడించారు. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయని జగన్ అన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు కూడా పింఛన్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 62 లక్షల 62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ రూ. 3వేలకు పెంచుతామనన్న మాట నిలబెట్టుకుంటామని అన్నారు.