మధ్యాహ్నం నుంచే రూ. 2,500 పింఛన్ పంపిణీ.. వాళ్లకు కొత్త ఏడాది అయిన మంచి ఆలోచనలు రావాలి : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు నెలకు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ (monthly pension) మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా (Guntur district) ప్రత్తిపాడులో (Prathipadu) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు నెలకు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ (monthly pension) మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా (Guntur district) ప్రత్తిపాడులో (Prathipadu) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు తెలియజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాత్రమే పింఛన్ రూ. 2 వేలు అని చెప్పిందన్నారు. గతంలో pension ఎక్కువ మందికి ఇవ్వకుండా ఉండేందుకు ఆలోచనలు చేసేవారని విమర్శించారు.
తాము అధికారంలోకి రాగానే పింఛన్ రూ. 2,250కి పెంచామని తెలిపారు. ఈరోజు నుంచి పింఛన్‌ను రూ. 2,500కు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ఇక్కడ మాట్లాడటం పూర్తవ్వగానే.. మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తారని వెల్లడించారు. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయని జగన్ అన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు కూడా పింఛన్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 62 లక్షల 62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ రూ. 3వేలకు పెంచుతామనన్న మాట నిలబెట్టుకుంటామని అన్నారు.
అత్యధిక పెన్షన్‌లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ. 1450 కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. పేదవాడికి తోడుగా ఉండాలని చెప్పి పెన్షన్ కోసం తాము అధికారంలో వచ్చినప్పటీ నుంచి 40 వేల కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం చూడటం లేదని అన్నారు. తమకు ఓటు వేయని వారికి కూడా పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. పేదలకు మంచి చేస్తుంటే రాజకీయ స్వార్ధంతో కొందరు పెద్దమనుషులు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ప్రతి నెల ఒకటో తారీఖున గడప ముందుకే వచ్చి వాలంటీర్ పింఛన్ అందిస్తున్నారని.. గడప గడపకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం దేశంలో ఒక్క ఏపీలోనే ఉందని సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నానని సీఎం జగన్ అన్నారు. మంచి చేస్తుంటే విమర్శించేవాళ్లు కూడా ఉంటారని మండిపడ్డారు. విమర్శించే వాళ్లకు తాము చేసే అభివృద్ది కనిపంచడం లేదా అని ప్రశ్నించారు. అభివృద్దిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కోర్టులకు వెళ్లి అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు. పేదలకు అమరావతిలో ఇల్ల స్థలాలు ఇస్తే.. కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యపు నేతలు ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఓటీఎస్ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులేని జగన్ అన్నారు.పేదలకు అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని.. సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తే దానిపై కూడా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చెడిపోయిన రాజకీయాల మధ్య పరిపాలన కొనసాగిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పేదలకు మంచి జరకుండా అడ్డుకుంటున్న వారికి ఈ ఏడాది అయినా మంచి ఆలోచనలు కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం రూ. 256 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. త్వరగానే ఈ పనులను పూర్తి చేస్తామని అన్నారు.