టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్ర‌బాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (peddireddy rama chandra reddy) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. 

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్ర‌బాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (peddireddy rama chandra reddy) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబు సీనియర్ శాస‌న‌స‌భ్యుడిగా ఉండి జిల్లాకు ఏం చేశాడ‌ని పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాల‌ని క‌ల‌లు క‌న్నాడ‌ని చెబుతున్నార‌ని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశార‌ని ఆయన ప్ర‌శ్నించారు. ఐదేళ్లలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు దేవుడు అయ్యార‌ని, చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో (chittoor district) పుట్ట‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌ంటూ దుయ్యబట్టారు. చంద్ర‌బాబు సీఎం‌గా ఉన్న‌ప్పుడు మైనింగ్ రాయ‌ల్టీపై క‌న్సెష‌న్ ఎందుకు ఇచ్చార‌ని రామచంద్రారెడ్డి ప్ర‌శ్నించారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోయారు కాబ‌ట్టే చంద్ర‌బాబుకు ఈ బాధ ఉంద‌ంటూ ఆయన దుయ్యబట్టారు. చంద్ర‌బాబు దుష్ట‌పాల‌న‌ను వ‌దిలించుకోవ‌డానికి 151 సీట్లు వైసీపీకి ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా కుప్పంలో ప‌ర్యటిస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబును తప్ప‌కుండా ఓడిస్తామ‌ని, ఇది త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. బాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

మరోవైపు టీడీపీని ఇబ్బంది పెట్టే వాళ్లని వదిలి పెట్టబోనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం నాడు Kuppam అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. మరో రెండేళ్ల తర్వాత రాస్ట్రానికి మరోసారి సీఎం అవుతానని Chandrababu ధీమా వ్యక్తం చేశారు. సీఎం కాగానే Tdpని ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతానని తేల్చి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందుల పెట్టిన వారిని వదిలి పెట్టనని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి వారిని శిక్షిస్తామన్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాల్సిందేనన్నారు. ఏ వ్యక్తి చేసినా తప్పు తప్పేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని శిక్షపడేలా చేయడంలో తప్పు లేదన్నారు.

రాష్ట్రంలో ycp అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలపై కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని చంద్రబాబు గతంలో పలుమార్లు మీడియా వేదికగానే ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీకి చెందిన కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు నేతలు జైలుకు కూడా వెళ్లారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు రెండు దఫాలు అరెస్టయ్యాడు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులు కూడా అరెస్టయ్యారు. మరో వైపు మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా పలుమార్లు పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజులపై కూడా కేసులు నమోదయ్యాయి. కొందరు నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు పలు మార్లు విమర్శించారు. డీజీపీ గౌతం సవాంగ్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు.