వైసీపీకి రెండో సారి ప్రజలు ఘన విజయం అందిస్తారని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ సారి కుప్పంలో కూడా టీడీపీ గెలవబోదని చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. 

ఇటీవ‌ల నిర్వ‌హించిన ప్లీన‌రీ స‌మావేశానికి హాజ‌రైన జ‌నాన్ని చూసి టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు భ‌య‌ప‌డుతున్నార‌ని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ సారి కుప్పంలో కూడా ఓడిపోతామేమో అని చంద్ర‌బాబు నాయుడుకు భ‌యం ప‌ట్టుకుంద‌ని తెలిపారు. అందుకే ఆయ‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని మంత్రి ఆరోపించారు. 

బిల్లుల విడుదలలో జాప్యం.. ఐఏఎస్ సత్యనారాయణపై ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన మంత్రి మేరుగ‌ మాజీ సీఎంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ జ‌గ‌న్ జ‌న ర‌థ‌చక్రాల కింద టీడీపీ నాయ‌కులు న‌లిగిపోతార‌ని అన్నారు. టీడీపీ కుప్పంలో కూడా గెల‌వ‌దని, గెలుస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నిక‌లకు రావాల‌ని స‌వాల్ విసిరారు. అక్క‌డ గెలిచి వైసీపీ స‌త్తా చూపిస్తామ‌ని తెలిపారు. 

కాంగ్రెస్ కార్యకర్తలపై చేయ్యేస్తే.. నరికేస్తాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఒక తల్లిగా వైఎస్‌ విజయమ్మ వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి మంచి భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌చ్చ గ్యాంగ్ వ‌క్రీక‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 14 సంవత్స‌రాల పాటు సీఎంగా ప‌ని చేశార‌ని, ఆ స‌మ‌యంలో ఆయ‌న ఏపీకి ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు ఎందుకు ఓట్లు వేయాల‌ని అన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు అడుగుతున్నార‌ని చెప్పారు. 

కామారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఆయ‌న ఒక్క గొప్ప ప‌థ‌కాన్ని అయినా ప్ర‌వేశ‌పెట్టారా అని మంత్రి మేరుగ నాగార్జున ప్ర‌శ్నించారు. ఎన్ టీ రామారావు రెండు రూపాయిల‌కు కిలో బియ్యం ప్ర‌వేశ‌పెట్టార‌ని, అయితే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబ‌ర్స్ మెంట్ వంటి మంచి స్కీమ్ ల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని చెప్పారు. సీఎం జ‌గ‌న్ అమ్మఒడి, రైతు భ‌రోసా, విద్యా కానుక వంటి గొప్ప స్కీమ్ ల‌ను ప్ర‌వేశ‌పెట్టి విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. క‌ష్ట స‌మ‌యంలోనే జ‌గ‌న్ ను వ‌ద‌ల‌ని జ‌నం.. ఇప్పుడెలా వదులుతార‌ని ప్ర‌శ్నించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎంతో ఆద‌రిస్తార‌ని చెప్పారు. ఇక మాజీ సీఎం అసెంబ్లీలో అడుగ‌పెట్ట‌నీయ‌కుండా ప్ర‌జ‌లు చూసుకుంటార‌ని తెలిపారు.