ఏపీ మంత్రి నారా లోకేష్.. దుబాయి పర్యటన ఖరారు అయ్యింది. లోకేష్ రేపటి నుంచి మూడు రోజులపాటు దుబాయిలో పర్యటించనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. మంత్రి పర్యటనకు సంబంధించిన కార్యచరణను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.

దుబాయిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో  గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు లోకేష్ అక్కడికి వెళ్తున్నారు. అనంతరం 13వ తేదీన దుబాయిలోని తెలుగువారితో లోకేష్ భేటీ అవుతారు. దీంతోపాటు 2019 దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ఎజెండా రూపకల్పనలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.