టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. చంద్రగిరిలో ప్రజలు ఓడించడంతోనే కుప్పంకు వలస వెళ్లారని నాని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కుప్పంను వదిలి చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారని మంత్రి సెటైర్లు వేశారు

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. చంద్రగిరిలో ప్రజలు ఓడించడంతోనే కుప్పంకు వలస వెళ్లారని నాని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు కుప్పంను వదిలి చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారని మంత్రి సెటైర్లు వేశారు. మరోవైపు బియ్యం పంపిణీ వాహనంలో తిరుపతి లడ్డూల పంపిణీపై విచారణకు ఆదేశించామని నాని స్పష్టం చేశారు.

అటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైనా మండిపడ్డారాయన. వీర్రాజు మాటలు ఆ పార్టీ కార్యకర్తలే పట్టించుకోరని మంత్రి వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూలు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలిచేస్తారా అంటూ నాని ప్రశ్నించారు.

వైసీపీ ఈ రాష్ట్రంలో వున్నంత వరకు వార్డ్ మెంబర్‌గా లోకేశ్, సర్పంచ్‌‌గా చంద్రబాబులు గెలవలేరంటూ ఆయన ధ్వజమెత్తారు. రేషన్ డెలీవరి వాహనం తనకు వచ్చినందుకు దానిని పొందిన ఓ లబ్ధిదారుడు తిరుపతి శ్రీవారిని దర్శించుకుని.. స్వామి వారి ప్రసాదాన్ని సన్నిహితులకు పంచాడని మంత్రి తెలిపారు.