పట్టాభి ఒక ఊరపంది.. చంద్రబాబు అంతు చూడటానికి నేనొక్కడిని చాలు: కొడాలి నాని

తెలుగుదేశం- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక టీడీపీ, చంద్రబాబుపై విరుచుకుపడే మంత్రి కొడాలి నాని (kodali nani) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని సమర్దిస్తున్నట్లు తెలిపారు.

minister kodali nani sensational comments on tdp chief chandrababu naidu and kommaredy pattabhi

ఏపీ ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల్లో వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు (ap bandh) పిలుపునివ్వడం జరిగిపోయింది. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక టీడీపీ, చంద్రబాబుపై విరుచుకుపడే మంత్రి కొడాలి నాని (kodali nani) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని సమర్దిస్తున్నట్లు తెలిపారు. పట్టాభి ఒక ఊరపందని.. చంద్రబాబు సంగతి చూడటానికి తనను ఒక్కడిని వదిలితే చాలు అని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పట్టాభిని చెప్పుతో కొట్టాలంటూ మంత్రి అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలకు ప్రతిఫలింగా దేవుడు లోకేశ్‌ను ఆయన కడుపున పుట్టేలా చేశాడంటూ ఆయన పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) ... తిరుపతి పర్యటన సందర్భంగా దాడి చేయించింది చంద్రబాబేనని కొడాలి నాని ఆరోపించారు. పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాతవాసి అని.. చంద్రబాబు చెప్పిన మాటల్నే పవన్ చెబుతారని దుయ్యబట్టారు. జనసేన బీఫామ్‌లను చంద్రబాబే ఇస్తాడంటూ ఆయన మండిపడ్డారు. 

కాగా, తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బుధవారం బంద్ నిర్వహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లను, నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినప్పటికీ పసుపు శ్రేణులు నిరసన తెలుపుతూనే వున్నాయి. 

ALso Read:అప్పుడు చంద్రబాబు ఎన్నో బస్సుల్ని తగులబెట్టించారు : అంబటి సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో నిన్న(మంగళవారం) టిడిపి, వైసిపిల మధ్య భౌతిక యుద్దం జరగ్గా నేడు మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపి నాయకులకు గట్టిగా హెచ్చరించడంతో పాటు సవాల్ కూడా విసిరారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ys jaganmohan reddy ని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తోలు తీస్తామంటూ టిడిపి నేతలకు మంత్రి anil kumar yadav తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. ysrcp అధ్యక్షులు జగన్ ను అనడం కాదు ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తమీద చెయ్యి వేసి చూడండి... తోలు వలిచేస్తాం అని హెచ్చరించారు. 

''ఒక ముఖ్యమంత్రిపైన ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు ముఖ్యమంత్రిని తిడుతూ.. తిరిగి మమ్మల్నే బూతులు మంత్రులు అని ప్రచారం చేస్తున్నారు. తమ సహనానికి కూడా ఒక స్థాయి ఉంటుంది'' అని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఇక టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని మమ్మల్ని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే టీడీపీ నేతలు ప్రియతమ నాయకుడు Ys jagan ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేకపోయారని... అందుకే టిడిపిపై తిరగబడ్డారని ఆయన వివరించారు. జగన్ ను ప్రేమించే వ్యక్తులు టీడీపీ నేతల మాటల్ని ఎన్నాళ్లు భరిస్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios