Asianet News TeluguAsianet News Telugu

నోటీసులు ఇస్తే తప్పేంటి??.. ఆంబోతులా అరిస్తే అదరం.. కొడాలి నాని

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు ఇవ్వడంలో తప్పేముందంటూ కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకు మంగళవారం ఉదయం  సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

minister kodali nani reacts on cid notices to chandrababu naidu - bsb
Author
Hyderabad, First Published Mar 16, 2021, 1:01 PM IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు ఇవ్వడంలో తప్పేముందంటూ కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకు మంగళవారం ఉదయం  సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ నోటీసులివ్వడం మీద టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. దీనిమీద రియాక్టైన మంత్రి కొడాలి నాని మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. 

సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోలతో చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలన్నారు.

ఆంబోతులా అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కలా బుద్ధవెంకన్న మొరుగుతున్నా మేం అదిరేదిలేదు.. బెదిరేది లేదు.. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాంలకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి..? అని కొడాలి నాని ప్రశ్నించారు. 

ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా.. దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుమీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు, రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే మాకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యం అని, ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం అని, దళితులకు న్యాయం చేసేల చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని సీఐడీని మంత్రి నాని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios