వాళ్ల కంటే గొప్పోడా.. దిగొచ్చాడా : చంద్రబాబుకు జైలులో సౌకర్యాలపై మంత్రి కారుమూరి ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇందిరాగాంధీ సహా ఎంతోమంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారని.. వాళ్లకంటే చంద్రబాబు గొప్పోడా అని కారుమూరి ప్రశ్నించారు.

minister karumuri nageswara rao fires on tdp chief chandrababu naidu ksp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఇటీవల ఆ సంస్థే చెప్పిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో వుంటే బాలకృష్ణ తన సినిమా విడుదలను ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి ప్రశ్నించారు. అందరూ రోడ్డెక్కాలని చెప్పే చంద్రబాబు, బాలయ్య కుటుంబ సభ్యులు మాత్రం సంపాదించడం మానరని కారుమూరి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూసిందని నాగేశ్వరరావు ఆరోపించారు. 

అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేంటీ అని ఆయన ప్రశ్నించారు. ఆయనేమైనా దిగొచ్చాడా అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ సహా ఎంతోమంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారని.. వాళ్లకంటే చంద్రబాబు గొప్పోడా అని కారుమూరి ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఒక జైలులో ఏసీ, అటాచ్‌డ్ బాత్‌రూమ్ ఇచ్చింది ఒక్క చంద్రబాబుకేనని ఆయన ధ్వజమెత్తారు. చట్టానికి అందరూ సమానమేనని, చంద్రబాబు చేసిన పాపాలు ఊరికేపోవని కారుమూరి నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. చంద్రబాబు పాలనలో స్కామ్‌లైతే.. వైసీపీ పాలనలో స్కీంలు అంటూ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిందని కారుమూరి కొనియాడారు. 

అంతకుముందు చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు సాయం నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,25,020 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి జమచేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, వెనకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నామని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నామని తెలిపారు. 

Also Read: కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు: వైఎస్ జగన్

ఎక్కడా అవినీతికి, వివక్షకు తావులేకుండా లబ్దిదారులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అప్పుడు అదే రాష్ట్రం.. అదే బడ్జెట్ అని అన్నారు. కానీ అప్పట్లో గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. అప్పుడు రాష్ట్రం ఎందుకు అభివృద్ది జరగలేదో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. కుప్పంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వలేకపోయాడని ఆరోపించారు. కుప్పంలో తమ ప్రభుత్వం 20 వేల ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని.. 8 వేల ఇంటి స్థలాల్లో ఇళ్లు కట్టించడం జరుగుతుందని చెప్పారు. 

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. టీడీపీ మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీని కూడా ఎత్తివేశారని విమర్వించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకరుణమాఫీ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయంలో పొదుపు సంఘాలు విలవిలలాడిపోయాయని విమర్శించారు. చంద్రబాబు గతంలో జాబు రావాలంటే.. బాబు రావాలని అన్నారని ఎద్దేవా చేశారు. జాబ్ ఇవ్వకుంటే రూ. 2 వేలు ఇస్తానని ప్రచారం చేశారని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పిల్లలను కూడా మోసం చేశారని విమర్శించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios