Asianet News TeluguAsianet News Telugu

సూసైడ్ లెటర్ లో మంత్రి జోగి రమేష్ పేరు... పెడనలో ఫోటోగ్రాఫర్ మిస్సింగ్ కలకలం

అవనిగడ్డ నియోజకవర్గంలోని ఉల్లిపాలెం-భవానిపురం వారధిపై మంత్రి జోగి రమేష్ స్టిక్కర్ తో బైక్ తో పాటు సూసైడి లెటర్ లభించడం కలకలం రేపుతోంది. 

Minister Jogi Ramesh personal photographer suicide AKP
Author
First Published Sep 26, 2023, 1:10 PM IST

అవనిగడ్డ : ఆంధ్ర ప్రదేశ్  గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ వ్యక్తగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ సూసైడ్ లెటర్ కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్ రాసి ఫోటోగ్రాఫర్ కనిపించకుండా పోయాడు. అవనిగడ్డ సమీపంలోని అంబటి బ్రాహ్మణయ్య వారధి వద్ద ఆదినారాయణ బైక్, వస్తువులను గుర్తించారు. దీంతో వారధి పైనుండి దూకి అతడు ఆత్మహత్య చేసుకుని వుంటాడని భావిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... పెడన నియోజకర్గం కాకర్లపూడి శివారు ముత్రాస్ పాలెంకు చెందిన యరగాని ఆదినారాయణ ఫోటో గ్రాఫర్. చాలాకాలంగా ఇతడు స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. గతేడాదే ఇతడికి పెళ్లయ్యింది. 

అయితే ఆదినారాయణ బైక్ అవనిగడ్డ నియోజకవర్గం ఉల్లిపాలెం-భవానిపురం బ్రిడ్జిపై అనుమానాస్పదంగా వుండటాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడే అతడి మొబైల్ ఫోన్, ఇతర వస్తువులతో పాటు ఓ సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆదినారాయణ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుని వుంటాడని అనుమానిస్తున్నారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారధి వద్దకు ఆదినారాయణ కుటుంబసభ్యులు, బంధువులు భారీగా చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Read More  పుంగనూరు అల్లర్ల కేసు... కొడుకుకు బెయిల్ రాలేదని టిడిపి నేత తల్లి ఆత్మహత్యాయత్నం

ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ లెటర్ ను బట్టి ఆర్థిక కష్టాల వల్లే ఆదినారాయణ ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో ఆదినాయణ మంత్రి జోగి రమేష్ పేరును కూడా ప్రస్తావించాడు. ''ఐదున్నరేళ్లుగా మీతోనే వున్నాను... అందుకుగాను నాకు, నా కుటుంబానికి చాలా సహాయం చేసారు. అయితే నాకు అవగాహన లేకుండా చేసిన కొన్ని పనులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నా కుటుంబానికి ఇకపైనా అండగగా ఉండాలని... నా భార్యకు ఏదయినా మంచి ఉద్యోగం ఇప్పించడం. మీనుండి సెలవు తీసుకుంటున్నా'' అంటూ మంత్రి జోగి రమేష్ ను కోరాడు ఆదినారాయణ. 

ఇక ఈ సూసైడ్ లెటర్ ద్వారా తన ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులకు వివరించాడు ఆదినారాయణ.  తన గురించి ఆలోచించి తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోంది.. . ఆయనను ఇలా చూస్తూ బ్రతకాలని అనిపించడం లేదని పేర్కొన్నారు.అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడికి సూచించాడు. తనకు ఏ దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని... ఇది తప్పని తెలిసిన తప్పడం లేదని అన్నాడు. అప్పులిచ్చిన వారిలో కొందరికయినా న్యాయం చేయాలని ఇన్నాళ్లు బ్రతికాను... ఇక బ్రతకలేకపోతున్నా అని పేర్కొన్నాడు. తన అప్పులతో కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ పేర్కొన్నారు. 

Read More  కుటుంబ సభ్యులతో విభేదాలు.. నరసరావుపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

ఇక భార్య గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యాడు ఆదినారాయణ. 'పెళ్లి చేసుకుని నిన్ను బాగా చూసుకోవాలని అనుకున్నా. కానీ అది నావల్ల కావడం లేదు. అందుకే ఇక నీనుండి దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నా. నేను బ్రతికుండి మీకు రోజూ ఇబ్బందిపెట్టడం కంటే ఒకేసారి చావడం మేలనుకున్నా. నా గురించి ఆలోచించకుండా సంతోషంగా వుండండి. ఇదే నా చివరి కోరిక' అని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. 

ఆదినారాయణ మంత్రి జోగి రమేష్ కు సన్నిహితుడు. దీంతో పోలీసులు వెంటనే కోడూరు పోలీసులు ప్రత్యేక పడవలు, ఈతగాళ్లను ఏర్పాటుచేసి ఆదినారాయణ కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు అతడు ఆఛూకీ లభించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios