ఆంధ్రప్రదేశ్‌లో బెంజ్ కారు వివాదం మరింత ముదురుతోంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు- మంత్రి జయరాం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా అయ్యన్న చేసిన ఆరోపణలపై మంత్రి జయరాం కౌంటరిచ్చారు.

అయ్యన్నకి మతిభ్రమించిందని... బుద్ధా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డుదారిలో రాజకీయాలు చేస్తున్న ట్విట్టర్ లోకేశ్, ప్రత్యక్ష రాజకీయాలు చేయలేని వ్యక్తి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ నాయకులకు పదవులు లేక మతిభ్రమించిందని ఆయన సెటైర్లు వేశారు.

కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే తాను విచారణకు ఆదేశించానని జయరాం గుర్తుచేశారు. విచారణలో గత ప్రభుత్వంలో పనిచేసిన అచ్చెన్నాయుడు అవినీతి పాల్పడ్డారని విచారణలో తేలింది.

2014-2018 సంవత్సరంలో అవినీతికి పాల్పడిన సంవత్సరంలో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. బెంజ్ కారును తెలకపల్లి కార్తీక్ 2019 డిసెంబర్‌లో కొనుగోలు చేశాడు.

Also Read:మాట్లాడితే జైల్లో వేస్తావా, రౌడీలతో కొట్టిస్తావా: జగన్ మీద అయ్యన్న

కారు ఫైనాన్స్ కట్టలేనందుకు బెంజ్ కారును ఫైనాన్షియల్ వారు సీజ్ చేశారని.. 2020 జూన్‌లో ఈఎస్ఐ స్కాం కింద కేసులు నమోదైందని మంత్రి తెలిపారు. కారు తీసుకుని ఉంటే ఏ 14 ముద్దాయిగా ఉన్న కార్తీక్‌ను నేనెందుకు కేసులో పేరు తొలగించలేదు.

భూమీ కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్ట్‌గా ఉన్నందుకే ఆ భూమిని కొన్నా... భూ కబ్జాకి ఎక్కడా పాల్పడలేదని మంత్రి జయరాం చెప్పుకొచ్చారు. కాగా శనివారం హైదరాబాద్ పంజాగుట్టలో మంత్రి జయరాం కుమారుడి బెంజ్ కారును ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం సీజ్ చేసింది.