విశాఖ ఎంపీ టికెట్ ఎవరకి కేటాయిస్తారనే విషయంపై సోమవారం సాయంత్రం కల్లా క్లారిటీ వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ ఎంపీ టికెట్,  రెండు అసెంబ్లీ స్థానాలపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించినట్లుగా గంటా తెలిపారు. 

పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగానా లేక ఎంపీగా పోటీ చేయాలన్న దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే భీమిలి నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. భరత్ కూడా ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారని తెలిపారు. ఎంపీ అభ్యర్థులుగా పల్లా, భరత్ పేర్లు ప్రస్తావనలో ఉన్నాయన్నారు. ఏదైనా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని గంటా వెల్లడించారు.

గాజువాక నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని చంద్రబాబుకు చెప్పానని పల్లా శ్రీనివాస్ అన్నారు. అధిష్టానం ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.