సహచర మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులను ఎక్కించుకుని అచ్చెన్న కొద్దిసేపు బస్సు నడిపి తన ఉబలాటాన్ని తీర్చుకున్నారు.

రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్టీసీ గరుడా బస్సు డ్రైవర్ గా మారిపోయారు. సంస్ధ కొత్తగా కొనుగోలు చేసిన గరుడా బస్సును చూడగానే నడపాలని అనిపించినట్లుంది. ఎంతైనా మంత్రిగారు కదా అడ్డేం ఉంటుంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో గరుడ(కరోనా)15 కొత్త బస్సులను ప్రారంభించారు. 100కొత్త బస్సులకు ఆర్డర్ ఇస్తే ప్రస్తుతానికి 15 వచ్చాయి. ప్రరంభోత్సవం కాగానే కొద్దిసేపు అచ్చెన్నాయడు డ్రైవర్ అవతారం ఎత్తేసారు. ఇంకేముంది సహచర మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులను ఎక్కించుకుని అచ్చెన్న కొద్దిసేపు బస్సు నడిపి తన ఉబలాటాన్ని తీర్చుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred