ప్రజలు మళ్లీ జగన్‌ను గెలిపిస్తామని చెబుతున్నారు.. కానీ గుర్తేదంటే సైకిల్ అంటున్నారు: మంత్రి ధర్మాన ఆవేదన
ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గుర్తుపై ప్రజల్లో అవగాహన పెంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిబా పూలే కాలనీలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘‘రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్‌నే గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. కానీ కొందరు మన గుర్తు ఏదంటే మాత్రం సైకిల్ అంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ గుర్తుపై ప్రజల్లో అవగాహన పెంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందని చెప్పారు.
ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే తాము మరోసారి అధికారంలోకి వస్తామని.. వద్దనుకుంటే దిగిపోతామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో దగ్గర సరిపడా కరెంటు లేకపోవడంతో కోతలు విధించాల్సి వస్తుందని మంత్రి ధర్మాన చెప్పారు. కోతలు తగ్గించేందుకే బయటి నుంచి కరెంట్ కొంటున్నట్టు తెలిపారు.