రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదా అని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాలో సమావేశంలో మాట్లాడగా.. వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు.

ప్రభుత్వ అవినీతి, అసమర్థ పాలనై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక లారీలతో తొక్కిస్తామంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల వెనుక సీఎం జగన్, సజ్జల రామకృష్ణా రెడ్డి, పోలీసు వ్యవహారాలు చూసే  ఇనగవరపు అవినాష్ కుట్రదారులు అంటూ ఉమా ఆరోపించారు. దీనిపై డీజీపీ సుమోటోగా తీసుకొని కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తనను ఏదో ఒక కేసులో జైలుకి పంపాలని 15 నెలలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏమీ దొరకక తనను చివరకు లారీలతో తొక్కించి చంపేయాల్ని చూస్తున్నారని మండిపడ్డారు.

ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. నగదు బదిలీ అంతా మోసమేనన్నారు. వీటికి సమాధానం చెప్పలేక అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ధ్వజమెత్తారు.

కొడాలి నాని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని.. అతనిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని  డిమాండ్ చేశారు.