మీడియాతో మంత్రి దేవినేని

నిర్మాణపరంగా పోలవరం ప్రాజెక్టు మరో రికార్డు సాధించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో రికార్డు సాధించామన్నారు. దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్‌ పనులు చేయలేదని చెప్పారు. చైనా త్రీగోర్జెస్‌ డ్యామ్‌లో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయని, జులైనాటికి చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు.