ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఏ లక్ష్యం కోసమైతే జనసేన కార్యకర్తలు మద్ధతిచ్చారో, అది తనవల్ల కాదని పరోక్షంగా చెప్పాడని చెల్లుబోయిన దుయ్యబట్టారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని ఆరోపించారు. తొలుత దేశమన్నాడు, తర్వాత రాష్ట్రం అన్నాడు, ఇప్పుడు గోదావరి జిల్లాలకు పరిమితం అంటున్నాడు అంటూ మంత్రి సెటైర్లు వేశారు. కుల ప్రస్తావన లేకుండా పవన్ ఏనాడైనా మాట్లాడారా, నీ సామాజిక వర్గం ఓట్లను టీడీపీ వైపు తిప్పమని చంద్రబాబు చెప్పారా అంటూ మంత్రి ప్రశ్నించారు. 

నారా లోకేష్‌ది ఫెయిల్యూర్ పాదయాత్ర అని.. అతను అసహనంతో వున్నాడని చెల్లుబోయిన దుయ్యబట్టారు. ఎంతమంది కలిసొచ్చినా.. ఎన్ని కుట్రలు చేసినా 2024లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే గెలుస్తుందని వేణుగోపాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. తనని నమ్మినవాళ్లని పవన్ కల్యాణ్ దగా చేశాడని.. అతను స్వతంత్రంగా గెలవలేడని మంత్రి ఎద్దేవా చేశారు. స్పెషల్ ప్యాకేజీల కోసమే పవన్ కల్యాణ్ పొత్తులు పెట్టుకుంటాడని, ఏ లక్ష్యం కోసమైతే జనసేన కార్యకర్తలు మద్ధతిచ్చారో, అది తనవల్ల కాదని పరోక్షంగా చెప్పాడని చెల్లుబోయిన దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా వున్నాయని.. ఆయన విజనరీ కాదని, విజన్ లేని వ్యక్తంటూ వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 

ALso Read: తాగినోళ్లే ఊగుతారు, వాగుతారు .. ఆ గ్లాస్‌లో ‘‘టీ ’’ చంద్రబాబు పోసిందే : పవన్‌పై నందిగం సురేష్ ఆగ్రహం

అంతకుముందు వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి కానీ పవన్ ఎందుకు అలా చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. క్లార్ వార్ గురించి మాట్లాడే పవన్ ఏ క్లాస్ నుంచి ప్యాకేజ్ అందుకున్నారని నందిగం సురేష్ ప్రశ్నించారు. అలాగే పవన్ పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఏ క్లాస్ నుంచి వచ్చింది.. ఎవరు ఖర్చు పెట్టారని ఆయన నిలదీశారు. పవన్ టీ తాగే గ్లాస్ తెచ్చుకుంటే .. టీ చంద్రబాబు పోశారని సురేష్ సెటైర్లు వేశారు. 

చంద్రబాబుకి బానిసత్వం చేయటంతో ఆయనకు అలసట రావడం లేదన్నారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని సురేష్ మండిపడ్డారు. తాను మాత్రమే సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా పవన్ తీరు వుందని.. ఆయన మాత్రం అందరినీ విమర్శిసాడట అంటూ దుయ్యబట్టారు. విమర్శలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పాలని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ మరోసారి అంతా ఏకమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఏకమైనా వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీయేనని నందిగం సురేష్ స్పష్టం చేశారు.