Asianet News TeluguAsianet News Telugu

జనం దృష్టి మరల్చేందుకే.. రామతీర్ధానికి: బాబుపై బొత్స విమర్శలు

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. బాబు రామతీర్థం పర్యటనను పురస్కరించుకుని బొత్స విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ పర్యటనకు ఒక రోజు ముందే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 

minister botsa satyanarayana remarks on tdp chief chandrababu naidu ksp
Author
Amaravathi, First Published Jan 2, 2021, 4:17 PM IST

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. బాబు రామతీర్థం పర్యటనను పురస్కరించుకుని బొత్స విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ పర్యటనకు ఒక రోజు ముందే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని బొత్స స్పష్టం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిల్లర రాజకీయాల కోసమే చంద్రబాబు రామతీర్థం వెళ్లారని సత్యనారాయణ మండిపడ్డారు.  ప్రభుత్వ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు పర్యటన చేపట్టారని ఆయన ధ్వజమెత్తారు.

అంతకుముందు రామతీర్థం ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. లోకేశ్ సవాల్‌ను స్వీకరించారు. చర్చకు మీరే డేట్ ఫిక్స్ చేయాలని ఆయన కోరారు. ఆలయాలపై దాడుల్లో టీడీపీ నేతల పాత్ర ఉందో లేదో చర్చిద్దామని విజయసాయి స్పష్టం చేశారు.

Also Read:రామతీర్థానికి చేరుకున్న చంద్రబాబు: ఆలయానికి లాక్, టీడీపీ ఆందోళన

తాను ఆలయాన్ని పరిశీలించి వస్తుండగా కళా వెంకట్రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన కారు అద్దాలు పగుల గొట్టారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు చట్ట విరుద్ధమని.. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు.

సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని.. తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తామని దీనికి రూ.2 కోట్లు అవుతుందని అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పారని విజయసాయి గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే చంద్రబాబని.. ఆయన హయాంలో 20 వేల ఆలయాలు మూతపడే పరిస్ధితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని చంద్రబాబు తొలగించారని.. బెజవాడలో 39 గుళ్లను కూలగొట్టించారని ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios