విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గానే కాకుండా ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం విశాఖ గురజాడ కళాక్షేత్రంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ ప్రమోషన్‌లో పని చేసిన 25 మంది పౌరులకు, సంస్థలకు మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్ అవార్డులు ప్రధానం చేశారు.

అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విశాఖపట్నం మహానగరంగా అభివృద్ధి చెందుతోందని.. పూర్తి స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా విశాఖ మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. సుందర నగరాల్లో విశాఖ దేశంలోనే 9వ స్థానం సంపాదించుకోవడం చాలా గొప్ప విషయమని బొత్స తెలిపారు.

అత్యుత్తమ ర్యాంకులు సంపాదించడంలో విశాఖ దూసుకుపోతోందని... కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ చేసి ఆ ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.

పవర్ జనరేషన్‌తో పాటుగా ఎరువుల తయారీ కూడా చేస్తున్నామని.. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

మరో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిదని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని.. నిత్యం నగరం పరిశుభ్రత ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అవంతి ప్రశంసించారు. పారిశుద్ధ్య కార్మికులు మాతృమూర్తులతో సమానమని.. వారి సేవలకు గుర్తుగా అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు.