రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్  రెడ్డి. పాత విధానానికి, కొత్త విధానానికి మధ్య వ్యత్యాసాన్ని ఆయన వివరించారు.  

రాష్ట్రంలో సామాన్యులకు షాకిస్తూ ఏపీ ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను (electricity charges) పెంచడంతో ప్రతిపక్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఛార్జీల పెంపుపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి (balineni srinivas reddy) విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి ప్ర‌జ‌ల‌పై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. 

''కామన్‌ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు వుంటుందని మంత్రి చెప్పారు. ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున ఛార్జీ పడుతుందని బాలినేని తెలిపారు. తద్వారా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1,235.75 అవుతుందన్నారు. ఇదే బిల్లు పాత విధానం ప్రకారం అయితే రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే'' అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

కాగా.. Andhra Pradesh లో power charges పెంచిన సంగతి తెలిసిందే. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 126-225 యూనిట్ కు రూ. 1.57 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 

226 నుండి 400 యూనిట్లకు యూనిట్ కు రూ. 1.16 పెంచారు. 400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారిపై రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. కేటగిరిలను రద్దు చేసి ఆరు స్లాబ్ లను తీసుకొచ్చినట్టుగా ఏపీ ఈఆర్‌సీ చైర్మెన్ ప్రకటించారు. 2016-17 లో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5.33 ఖర్చు అయిందని 2020-21 నాటికి యూనిట్ విద్యుత్ ఖర్చు రూ. 6.87కి పెరిగిందని ఈఆర్‌సీకి ఏపీ విద్యుత్ శాఖకు చెందిన డిస్కం కంపెనీలు వివరించాయి.

పెరిగిన విద్యుత్ ఖర్చుల మేరకు చార్జీల పెంపును అంగీకరించాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. దీంతో డిస్కంలకు విద్యుత్ చార్జీలను పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చినట్టుగా ఈఆర్‌సీ చైర్మెన్ నాగార్జున రెడ్డి వివరించారు. ఇప్పటికే తెలంగాణలో కూడా విద్యుత్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. యూనిట్ కు 50 పైసల నుండి రూ. 2 ల వరకు చార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి. 125 నుండి 225 యూనిట్ విద్యుత్ ను వినియోగించే వినియోగదారులు ఎక్కువగా రాష్ట్రంలో ఉంటారు. 

వీరిపై భారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో రూ. 4,400 కోట్ల భారం వినియోగదారులపై పడనుంది. కోటి 70 లక్ష మందిపై విద్యత్ చార్జీల భారాన్ని డిస్కంలు మోపాయి..వివిధ కేటగిరిల కింద రూ. 1400 కోట్ల భారం పడనుంది. 75 యూనిట్ల లోపు వాడే వినియోగదారులు రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ఉంటారు.మూడేళ్లలో ట్రూప్ అప్ చార్జీల పేరుతో రూ. 3 వేల కోట్ల వసూలుకు ఈఆర్సీ అనుమతిని ఇచ్చింది.2014 నుండి 2019 వరకు సర్ధుబాటు చార్జీల పేరుతో వసూళ్లు చేశాయి డిస్కం సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారీఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగష్టు నుండి ట్రూఆప్ చార్జీలను వసూలు చేయనున్నారు.