Asianet News TeluguAsianet News Telugu

జగన్ కేబినెట్ లో 100 శాతం ఔట్: మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో 100 శాతం కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని బాంబు పేల్చారు. త్వరలో మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు వైసీపీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
 

minister balineni srinivasa reddy sensational comments ys jagan cabinet expansion
Author
Amaravati, First Published Sep 25, 2021, 5:46 PM IST

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో 100 శాతం కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని బాంబు పేల్చారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్ చెప్పారని ఆయన తెలిపారు. తన మంత్రి పదవి పోయినా తాను భయపడనని బాలినేని తేల్చిచెప్పారు. తనకు పదవుల కన్నా.. పార్టీయే ముఖ్యమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు వైసీపీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

ఇదిలా ఉంటే రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించి కొత్తవారికి స్థానం కల్పిస్తానని సీఎం జగన్ ప్రమాణస్వీకారానికి ముందే చెప్పడంతో.. ఆ సమయం దగ్గర పడిందనే చర్చ కూడా జరుగుతోంది. తన మంత్రివర్గంలో ఎవరిని తొలగించి ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ అప్పుడే కసరత్తు కూడా మొదలుపెట్టారనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే తాజాగా ఈ పనిని సీఎం జగన్‌కు బదులుగా పీకే టీమ్ చేస్తుందనే ప్రచారం మొదలైంది. కేబినెట్ నుంచి ఎవరిని తప్పించాలి ? కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ సామాజిక లెక్కలతో పాటు అభ్యర్థి సానుకూలతలను బేరీజు వేసుకుంటారు. ఈ విషయంలో సీఎం జగన్ ఇంటలిజెన్స్ ఇంతకుముందు పలు సర్వేల సహకారం తీసుకోవాలని భావించగా.. ఇప్పుడు మాత్రం పీకే టీమ్ ఇచ్చే నివేదికల ఆధారంగానే కొత్తగా కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios