ఏపీ  నూతన మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో... అలా వరాలు కురిపించేశారు. గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన వన్యప్రాణి సంరక్షణకు కమిటీల ఏర్పాటు ఫైలుపై బాలినేని తొలి సంతకం చేశారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీని పొడిగిస్తున్నామని తెలిపారు.
 
ఎస్సీ-ఎస్టీలకు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణను అరికడతామన్నారు. 5 వేల టన్నుల ఎర్ర చందనం వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పీపీఏలను సమీక్షిస్తామని మంత్రి బాలినేని వెల్లడించారు.