కేవలం ఒక్క రూపాయికే పక్కా ఇళ్లు: మంత్రి అనిల్

గతంలో 5ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి పక్కా ఇళ్లు నిర్మిచి ప్రజలను 20 ఏళ్ల పాటు రుణం కట్టేవిధంగా చేస్తా అన్నవాళ్ళు ఇప్పుడు సిగ్గులేకుండా ఉచితంగా ఇస్తాం అంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

minister anil kumar yadav nellore tour

నెల్లూరు: పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇద్దామని వైసిపి ప్రభుత్వం యోచిస్తే కొంతమంది కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ అడ్డంకులన్నింటిని అధిగమించి మొదటి విడతగా 15లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. అంతేకాకుండా మరో 30లక్షల మందికి ఇంటి పట్టాలను అందిస్తామన్నారు మంత్రి అనిల్ యాదవ్. 

''గతంలో 5ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి పక్కా ఇళ్లు నిర్మిచి ప్రజలను 20 ఏళ్ల పాటు రుణం కట్టేవిధంగా చేస్తా అన్నవాళ్ళు ఇప్పుడు సిగ్గులేకుండా ఉచితంగా ఇస్తాం అంటున్నారు. కానీ తాము మొదటి నుండి ఒకేమాటపై వున్నామని... ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కరూపాయికే ఇళ్లు ఇచ్చి తీరుతాం'' అని అనిల్ స్పష్టం చేశారు.

''గతంలో నిర్మించిన 300చదరపు అడుగుల ఇల్లు  4అంకణాలు మాత్రమే. మేము 6 అంకణాలు ఉచితంగా ఇస్తుంటే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఇంటి నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారు'' అని ఆరోపించారు. ''బిసి, ఎస్సి, ఎస్టీ మైనార్టీ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ఎంతమందికి అందుతున్నాయో టీడీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడాలి. అంతేగానీ నోటికి ఎంతొస్తే అంత వాగొద్దు'' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios