Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు పల్లకిని మోస్తున్నట్లుగా పవన్ ట్వీట్.. మేం మా నాయకుడినే మోస్తామంటూ అంబటి కౌంటర్

సీఎం జగన్, మంత్రులను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. తాము మా నాయకుడినే మోస్తామని, ప్యాకేజ్‌ల కోసం పక్క నాయకుడిని కాదంటూ ట్వీట్ చేశారు. 
 

minister ambati rambabu counter to janasena chief pawan kalyan tweet ksp
Author
First Published May 28, 2023, 5:24 PM IST

వైసీపీ, జనసేన మధ్య కార్టూన్ వార్ నడుస్తోంది. వైసీపీ పాలనపై జనసేన అధినేత పవన్ ట్వీట్ చేశారు. ‘‘ కొత్తా దేవుడండి.. కొంగ్రొత్తా దేవుడండి.. ఇతడేదిక్కని మొక్కకపోతే దిక్కూ, మొక్కూ లేదండి’’ అంటూ స్పెషల్ కార్టూన్ తయారు చేసి ట్వీట్ చేశారు పవన్. నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పల్లకిలో ఎక్కి కూర్చుంటే దానిని అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని పలువురు మోస్తున్నట్లుగా కార్టూన్ పోస్ట్ చేశారు పవన్. 

అయితే పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. పవన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. మా నాయకుడినే మోస్తాం, ప్యాకేజ్ కోసం పక్క నాయకుడిని కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దానికి వైసీపీ నాయకులు సపోర్ట్‌గా కామెంట్ చేస్తున్నారు. 

ALso Read: పవన్ పొలిటీషన్ కాదు... కూలీ నెంబర్ 1 మాత్రమే : అంబటి రాంబాబు ఎద్దేవా

అంతకుముందు కొద్దిరోజుల క్రితం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అసలు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి  పవన్ కల్యాణ్... రాజకీయాల కోసం ఏదయినా చేసే వ్యక్తి  చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ది చూకూర్చేందుకే పవన్ పార్టీ పెట్టాడని.. ఆయన నాయకుడు కాదు కూలీ నెంబర్ 1 అంటూ అంబటి ఎద్దేవా చేసారు.  పవన్ కల్యాణ్, జనసేన పార్టీ రోజురోజుకు మరగుజ్జులా మారిపోతుందని అంబటి అన్నారు. పవన్ పెరగడు... ఇతరులను పెరగనివ్వడని అన్నారు. రాజకీయ పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పవన్ నోట్లో వేలు పెట్టుకుని చంద్రబాబు చేయి పట్టుకునే తిరుగుతున్నాడని అన్నారు. 

2014 లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ ఇప్పటివరకు రాజకీయంగా పెరిగిందేమీ లేదన్నారు. పవన్ రాజకీయంగా మరగుజ్జుగా మారిపోయాడని అంబటి అన్నారు. జనసేన ప్రచారం కోసం పవన్ కల్యాణ్ తయారుచేయించుకున్న వారాహి వాహనం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదులుతుందని అంబటి అన్నారు. ఆడవాళ్లు బంగారు వడ్డాణం చేయించుకున్నట్లు పవన్ వారాహి వాహనం చేయించుకుని దాచుకున్నాడని ఎద్దేవా చేసాడు. దళిత ద్రోహి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతివ్వడం దురదృష్టకరమని... వీరిని నమ్మినవారు సర్వనాశనం అవుతారని అంబటి మండిపడ్డారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios