జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. పవన్‌కు పరిపక్వత లేదని, అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్నాడని, బట్టలూడదీసి కొడతానని అంటున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడితూ.. వారాహిపై పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్నాడని, బట్టలూడదీసి కొడతానని అంటున్నారని.. కొట్టించుకోవడానికి మేం తెరగా వున్నామా అంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు పరిపక్వత లేదని, అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే సినిమా షూటింగ్‌లు అనుకునే పరిస్ధితిలో పవన్ వున్నారని రాంబాబు సెటైర్లు వేశారు. 

ఇదే సమయంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపైనా అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. తనను ఓడించడానికి వస్తాదులను దించుతున్నారని, కన్నాకు మైక్ దొరికితే అవాకులు చవాకులు పేల్చుతాడని దుయ్యబట్టారు. సత్తెనపల్లికి ఆయన మొన్ననే వచ్చారని.. కానీ తాను ఎప్పటి నుంచో అక్కడే వున్నానని అంబటి పేర్కొన్నారు. కన్నా మాదిరిగా పార్టీలు , నియోజకవర్గాలు మారిన వ్యక్తిని కాదన్నారు. త్వరలో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వస్తాదులను కూల్చుతామని.. సీఎం జగన్ ఆశీస్సులతో సత్తెనపల్లిలో మూడోసారి గెలుస్తానని రాంబాబు స్పష్టం చేశారు. 

ALso Read: పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులతోపాటు నేను కూడా కోరుకుంటున్నా..: ఏపీ మంత్రి సంచలనం

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరిగింది. టీడీపీ, జనసేనలు ఒక వైపు.. వైసీపీ మరో వైపు వేడి వాడి వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. ప్రజల ఆదరణ కోసం ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నాయి. నారా లోకేశ్ యాత్ర ఒక వైపు ఉండగా.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. సీఎం పదవి పైనా ఈ నేపథ్యంలో జోరుగా కామెంట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ డిస్కషన్ ఉంటే సాధారణమే అనుకోవచ్చు. కానీ, రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనడం సంచలనంగా మారింది. అయితే.. ఆయన ఈ వ్యాఖ్య చేయడం వెనుక సారం వేరే ఉన్నది.

పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు.. తాను కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాని ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తిరుమలలో అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాని వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు, పాదయాత్రలు చేసుకోవచ్చని అన్నారు. అయితే, సీఎం కావాలంటే మాత్రం దానికి ఒక లెక్క ఉంటుందని వివరించారు.

రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే సగానికి ఎక్కువ అంటే కనీసం 88 స్థానాల్లో గెలిస్తే సీఎం కావడం ఒక విధానం అని వివరించారు. లేదా.. పొత్తుతో పోటీ చేస్తే (టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తే అనే కోణంలో మాట్లాడుతూ..) 100 స్థానాల్లోనైనా పోటీ చేయాలని, అందులో కనీసం 50 స్థానాల్లోనైనా గెలవాలని చెప్పారు. ఈ రెండు విధాల్లో ముఖ్యమంత్రి కావొచ్చని అన్నారు.