Asianet News TeluguAsianet News Telugu

శిల్పాకు కౌంట్ డౌన్ మొదలైంది

  • వైసీపీ నుండి పోటీ చేస్తున్న శిల్పాను ఉద్దేశించి కౌంట్ డౌన్ మొదలైనట్లు వ్యాఖ్యానించటం గమనార్హం.
  • అంటే, ప్రత్యర్ధి పార్టీని ఏ స్దాయిలో ప్రభుత్వం బెదిరిస్తోందో అర్ధమవుతోంది.
  • ఎందుకంటే, నంద్యాలలో గెలవటానికి టిడిపి నానా అవస్తలు పడుతోంది.
  • అందుకనే చివరకు బెదిరింపులకు దిగినట్లున్నారు.
Minister akhila threatening ycp candidate

‘‘శిల్పా మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది’..ఇది మంత్రి భూమా అఖిలప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలు. భూమా బ్రహ్మానందరెడ్డి ఈరోజు నామినేషన్ వేసారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైసీపీ నుండి పోటీ చేస్తున్న శిల్పాను ఉద్దేశించి కౌంట్ డౌన్ మొదలైనట్లు వ్యాఖ్యానించటం గమనార్హం. అంటే, ప్రత్యర్ధి పార్టీని ఏ స్దాయిలో ప్రభుత్వం బెదిరిస్తోందో అర్ధమవుతోంది. ఎందుకంటే, నంద్యాలలో గెలవటానికి టిడిపి నానా అవస్తలు పడుతోంది. అందుకనే చివరకు బెదిరింపులకు దిగినట్లున్నారు.

భూమా నాగిరెడ్డిని అక్రమ కేసులతో వేధించారని అఖిల భావోద్వేగంతో చెప్పటం గమనార్హం. స్వయంగా చంద్రబాబునాయుడే నాగిరెడ్డిని వెంటాడాలని నిర్ణయించుకున్నాక మిగిలిన వాళ్లు ఏం చేయగలరు? వైసీపీ తరపున గెలిచిన భూమాను టిడిపిలోకి లాక్కోవాలని నిర్ణయిచిందే చంద్రబాబన్న సంగతి మంత్రి మరచిపోయినట్లున్నారు. ఎందుకంటే, తన తండ్రిని చంద్రబాబు వేధిస్తున్నారని ఒకసారి, తన తండ్రికి ఏమన్నా అయితే చంద్రబాబే బాధ్యత వహించాలని మరోసారి అఖిల చెప్పిన సంగతి అందరికీ గుర్తే.

అదేవిధంగా పదేళ్ళల్లో నంద్యాలకు శిల్పా మోహన్ రెడ్డి ఏం చేసారని కూడా జనాలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భూమా నాగిరెడ్డి వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించటాన్ని జనాలు టిడిపి అభ్యర్ధిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నది అఖిల దృష్టిలోకి రాలేదేమో. అంతెందుకు మూడేళ్ళల్లో తమ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోలేదంటూ గోస్పాడు మండలంలోని యారాల గ్రామస్తులు సాక్ష్యాత్తు చంద్రబాబునాయుడునే నిలదీసిన విషయాన్ని జాతీయస్ధాయిలో అందరూ చూసిందే.  పాపం తమకెదురవుతున్న చేదుల అనుభవాలను వైసీపీ అభ్యర్ధికి కూడా ఎదురవ్వాలని కోరుకోవటంలో తప్పులేదు లేండి.

Follow Us:
Download App:
  • android
  • ios