ఓటమిభయంతోనే వైసీపీ నేతలు కుట్ర పన్నినట్లు ఆరోపించటం గమనార్హం. మధు తదితరులు, చక్రపాణి మనుషులు ఎదురుపడినపుడు చక్రపాణి మద్దతుదారులు రాళ్ళు రువ్వటంతోనే ఘర్షణ మొదలైందన్నారు. కేవలం ఆత్మరక్షణ కోసమే మధు గన్ మెన్ గాలిలోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అఖిల వివరించారు.
నంద్యాల ఘర్ణణ వైసీపీ కుట్రేనట. అలాగని మంత్రి అఖిలప్రియ చెప్పారు. గురువారం ఉదయం వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డిని బెదిరించేందుకు గాలిలోకి కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. తమకు సన్నిహితుని అంత్యక్రియలకు చక్రపాణి తదితరులు హాజరైనపుడు హటాత్తుగా అభిరుచి మధు అనే రౌడీషీటర్ కాల్పులు జరపటం నంద్యాలలో సంచలనం సృష్టించింది. తర్వాత చక్రపాణి మాట్లాడుతూ, తనపై హత్యాయత్నం జరిగిందని చెబుతూనే మధు ప్రస్తుతం మంత్రి అఖిలప్రియకు సన్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపించారు.
దాంతో అందరి చూపులు అఖిలవైపుకు మళ్ళాయి. ఘటనపై మంత్రి కూడా వివరణ ఇచ్చుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఓటమిభయంతోనే వైసీపీ నేతలు కుట్ర పన్నినట్లు ఆరోపించటం గమనార్హం. మధు తదితరులు, చక్రపాణి మనుషులు ఎదురుపడినపుడు చక్రపాణి మద్దతుదారులు రాళ్ళు రువ్వటంతోనే ఘర్షణ మొదలైందన్నారు. కేవలం ఆత్మరక్షణ కోసమే మధు గన్ మెన్ గాలిలోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అఖిల వివరించారు. టిడిపి కార్యకర్తలు ఎవరు కూడా అదైర్యపడొద్దని కూడా మంత్రి ధైర్యం చెప్పారు.
ఇంతకీ విషయమేంటంటే, అభిరుచి మధునే చక్రపాణిరెడ్డిపై దాడికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాగంటే, జరిగిన ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. దాంతో దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యల ప్రకారం మధునే చక్రపాణిరెడ్డిని కత్తితో బెదిరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ‘నీ అంతు చూడాలనే వచ్చాను’ అంటూ అరవటం కూడా వినిపించింది. అంటే అర్ధమేంటి? వ్యూహం ప్రకారమే మధు తన అనుచరులతో తుపాకి, కత్తులను తీసుకు వచ్చినట్లు అర్దమవుతోంది.
కానీ మంత్రేమో మధు అమాయకుడన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అంతేకాకుండా జరిగిన ఘటనకు పూర్తి భిన్నంగా చెబుతున్నారు. ఓటమి భయంతో వైసీపీ కుట్ర చేసిందని చెప్పటంలో అర్ధమే లేదు. ఎందుకంటే, పోలింగ్ జరిగిపోయింది. తేలాల్సింది ఫలితం మాత్రమే. ఇపుడు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదన్న విషయాన్ని మంత్రి మరచిపోయినట్లున్నారు.
