Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ: మంత్రి ఆదిమూలపు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ అంశంపై జగన్ కేబినెట్‌లో మంత్రులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. కేబినెట్‌లో 100 శాతం మార్పులు వుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

minister adimulapu suresh sensational comments on ap cabinet reshuffle
Author
Guntur, First Published Sep 28, 2021, 2:34 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్లకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ అంశంపై జగన్ కేబినెట్‌లో మంత్రులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. కేబినెట్‌లో 100 శాతం మార్పులు వుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. సోమవారం గుంటూరు జిల్లా నగరంపాలెంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ, కూర్పునకు సంబంధించి అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి అభీష్టం మేరకే జరుగుతాయని మంత్రి సురేశ్ అన్నారు.

Also Read:జగన్ కేబినెట్ లో 100 శాతం ఔట్: మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

ఇక రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం విద్యపై మరోసారి ఆదిమూలపు క్లారిటీ ఇచ్చారు. తెలుగు భాషాభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌కూ నాణ్యమైన విద్యనందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో విద్యనభ్యసించిన అభ్యర్థులు ఏ పోటీ పరీక్షలలోనైనా విజయం సాధించాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు పరం చేసి బడుగులకు దూరం చేస్తే తమ ప్రభుత్వం బడుగులకు దగ్గర చేస్తోందని సురేశ్ పేర్కొన్నారు. అంతేకాదు ప్రైవేటు వ‌ర్సిటీల్లో 35 శాతం సీట్లు రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించిన ఫీజులకు బడుగు, బలహీన వ‌ర్గాల‌ విద్యార్థులు కేటాయించాలని జ‌గ‌న్ ఆదేశించిన విషయాన్ని మంత్రి సురేశ్ గుర్తు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios