Asianet News TeluguAsianet News Telugu

ఆ నెంబర్ నుంచి ఐఏఎస్‌కు మెసేజ్‌లు: మొబైల్ సీఐడీ దగ్గరే, నా వద్ద లేదన్న రఘురామ

వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పేరిట త‌న‌కు సందేశాలు వ‌స్తున్నాయ‌ని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ ర‌మేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. 9000911111 నంబ‌ర్ నుంచి త‌న‌తో పాటు త‌న బంధువుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు.

messages from mp raghurama krishnam raju number to former ias ksp
Author
Amaravathi, First Published Jun 5, 2021, 4:37 PM IST

వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పేరిట త‌న‌కు సందేశాలు వ‌స్తున్నాయ‌ని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ ర‌మేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. 9000911111 నంబ‌ర్ నుంచి త‌న‌తో పాటు త‌న బంధువుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోసం ఈ స‌మాచారం పంచుకుంటున్న‌ట్లు రమేశ్ తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ర‌ఘురామ‌ స్పందించారు.  

త‌న మొబైల్‌ను మే 14న సీఐడీ పోలీసులు సీజ్ చేశార‌ని.. ఆయన ట్విట‌్టర్ ద్వారా స‌మాధాన‌మిచ్చారు. త‌న మొబైల్‌ ఇంకా సీఐడీ అధికారుల వ‌ద్దే ఉంద‌ని.. తిరిగి ఇవ్వాల‌ని లీగ‌ల్ నోటీస్ ఇచ్చిన‌ట్లు ర‌ఘురామ‌కృష్ణంరాజు పేర్కొన్నారు. మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు ఆ నెంబ‌ర్ నుంచి తాను ఎవ‌రికీ మెసేజ్‌లు పంప‌లేద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. నాలుగు రోజుల కిందట ఆ సిమ్ బ్లాక్ చేసి కొత్త‌ది తీసుకున్న‌ట్లు వివరించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి త‌న ఫోన్ నెంబ‌ర్‌ను దుర్వినియోగం చేసిన‌ట్ల‌యితే సీఐడీ అద‌న‌పు డీజీ సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ర‌ఘురామ హెచ్చరించారు. 

Also Read:ఏపీ సీఐడి అదనపు డిజీకి షాక్: లీగల్ నోటీసు పంపిన రఘురామ కృష్ణంరాజు లాయర్

కాగా, ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డిజీకి రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది శనివారం లీగల్ నోటీసు పంపించారు. రఘురామ కృష్ణమరాజును అరెస్టు చేసే సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమ చేయాలని మంగళగిరి ఎస్ హెచ్ఓకు నోటీసు పంపించారు. ఎంపీని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి మొబైలే తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. ఆ మొబైల్ ఫోన్ లో విలువైన సమాచారం ఉందని న్యాయవాది తన నోటీసులు చెప్పారు. ఇతర అంశాలతో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని ఎఁపీని కస్టడీలో హింసించారని ఆయన ఆరోపించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios