Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సీఐడి అదనపు డిజీకి షాక్: లీగల్ నోటీసు పంపిన రఘురామ కృష్ణంరాజు లాయర్

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది ఏపీ సిఐడి అదనపు డిజికి లీగల్ నోటీసు పంపించారు. అరెస్టు చేసిన సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని అడిగారు.

Raghurama Krishnam Raju lawyer sends legal notice to AP CID
Author
Amaravati, First Published Jun 5, 2021, 11:59 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డిజీకి వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది లీగల్ నోటీసు పంపించారు. రఘురామ కృష్ణమరాజును అరెస్టు చేసే సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమ చేయాలని మంగళగిరి ఎస్ హెచ్ఓకు నోటీసు పంపించారు. ఎంపీని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి మొబైలే తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. 

ఆ మొబైల్ ఫోన్ లో విలువైన సమాచారం ఉందని న్యాయవాది తన నోటీసులు చెప్పారు. ఇతర అంశాలతో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని ఎఁపీని కస్టడీలో హింసించారని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును గత నెలలో ఏపీ సిఐడి హైదరాబాదులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

హైదరాబదు నుంచి రఘురామ కృష్ణంరాజును గుటూరు తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చుతూ కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే, రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సుప్రీంకోర్టు రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మీద విడుదలైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స జరిగిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios