Asianet News TeluguAsianet News Telugu

రఘురామ ఆరోగ్యంపై హెల్త్ రిపోర్ట్... మేజిస్ట్రేట్‌కు అందజేసిన వైద్యుల కమిటీ

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం, ఆయన కాలి గాయాలపై మెడికల్ బోర్డ్ నివేదిక తయారు చేసి సీల్డ్ కవర్‌లో జిల్లా మేజిస్ట్రేట్‌కు అందజేసింది. మరికాసేపట్లో మేజిస్ట్రేట్‌ దీనిని హైకోర్టు డివిజనల్ బెంచ్‌కు సమర్పించనున్నారు. 

medical board committee report on ysrcp mp raghurama krishnam raju health condition ksp
Author
Guntur, First Published May 16, 2021, 5:17 PM IST

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం, ఆయన కాలి గాయాలపై మెడికల్ బోర్డ్ నివేదిక తయారు చేసి సీల్డ్ కవర్‌లో జిల్లా మేజిస్ట్రేట్‌కు అందజేసింది. మరికాసేపట్లో మేజిస్ట్రేట్‌ దీనిని హైకోర్టు డివిజనల్ బెంచ్‌కు సమర్పించనున్నారు.

కాగా, హైదరాబాద్‌లో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన సీఐడీ శనివారం గుంటూరులోని సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది.

ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్‌ను నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించింది. దీంతో ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో ఎంపీకి టెస్టులు నిర్వహించారు వైద్యులు. 

Also Read:జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి.. జిల్లా జైలుకు రఘురామకృష్ణంరాజు

అంతకుముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు జైలుకు తరలించారు. ఇప్పటికే ఆయన వైద్య చికిత్సలు పూర్తవ్వడంతో వైద్యుల అనుమతితో జీజీహెచ్ నుంచి గుంటూరు జిల్లా జైలుకు రఘురామను తరలించారు సీఐడీ పోలీసులు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. 

మరోవైపు ఈ కేసులో రఘురామకృష్ణంరాజుపై 12/2021 నమోదు చేశారు.  అంతేకాదు ఈ కేసులో ఏ-1గా రఘురామకృష్ణరాజు,  ఏ- 2గా టీవీ5,  ఏ- 3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది.

అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ఇది ఇలా ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీసీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 వరకు రిమాండ్‌కు  కోర్టు అనుమతి ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios