రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై ఉన్న సన్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో మంటల చెలరేగాయి.
రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై ఉన్న సన్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో మంటల చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుంటంతో.. షోరూమ్ పై అంతస్తుల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళన చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. షోరూమ్ పై అంతస్తుల్లో ఉన్నవారిని క్షేమంగా బయటకు తీసుకొస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

షోరూమ్‌లో భారీగా మంటలు ఎగసిపడుతుండటం, పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక, మంటలు చెలరేగిన సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేరని చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే భారీగా ఆస్థి నష్టం చోటుచేసుకునే అవకాశం ఉంది.
