అనుమానస్పదస్థితిలో ఓ వివాహిత చనిపోయారు. అయితే తమ కూతురునే అల్లుడే చంపేసి ఉంటాడని మృతురాలి త‌ల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేశారు. దీనిపై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. 

అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘ‌ట‌న ఆదివారం విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. ఈ ఘట‌న‌పై మృతురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

డేటింగ్ యాప్‌ మాయలో డాక్టర్.. నిందితుడిని అరెస్టే చేస్తే వదిలేయాలని రచ్చ!.. మొత్తంగా రూ. కోటిన్నర మాయం..

మృతురాలి త‌ల్లిదండ్రుల పేరు వడ్డాది వాసు, వడ్డాది జానకి. వీరు కుమార్తె దుర్గాసాయి మత్స్య‌కార కుటుంబానికి చెందిన లోకేష్ ను ప్రేమించింది. దీంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని వీరికి వివాహం జ‌రిపించాల‌ని నిర్ణ‌యించాయి. పెద్ద స‌మ‌క్షంలో వీరి పెళ్లి 2017 సంవ‌త్స‌రంలో జ‌రిగింది. 

ఖబర్దార్ కేసీఆర్... బొంద పెట్టడానికి జనం ఎప్పుడో రెడీ : షర్మిల ఫైర్

లోకేష్ సీమెన్ గా ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే క‌రోనా వ‌ల్ల రెండు సంవ‌త్స‌రాలుగా డ్యూటీకి వెళ్ల‌డం లేదు. దీంతో ఈ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. అప్ప‌టి నుంచి ఇవి ఇలా అప్పుడప్పుడు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల కింద‌ట శీరిష త‌న పుట్టింటికి వెళ్లింది. అక్క‌డే ఉంటోంది. 

అమరావతిపై ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పణ: పిటిషన్లపై విచారణ ఆగష్టు 23కి వాయిదా

ఈ క్ర‌మంలో భ‌ర్త లోకేష్ శ‌నివారం భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అత్త‌మామ‌ను ఒప్పించి శీరిష‌ను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణ‌యించుకున్నాడు. అయితే ఈ స‌మ‌యంలో కూడా కొంచెం గొడ‌వ జ‌రిగింది. దీంతో లోకేష్ త‌న బెల్టు తీసి శీరిష‌ను కొట్టాడు. చివ‌రికి ఎలాగోలా న‌చ్చజెప్పి త‌న భార్య‌ను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆదివారం మాత్రం శీరిష ఊరేసుకొని క‌నిపించింది. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు అల్లుడిపైనే అనుమానం వ్య‌క్తం చేశారు. త‌మ బిడ్డ శ‌రీరంపై గాయాలు ఉన్నాయ‌ని, లోకేషే చంపేసి ఉంటార‌ని ఆరోపించారు. దీంతో వ‌న్ టౌన్ పోలీసులు త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు.